iDreamPost

సలార్ టీమ్ కి AP ప్రభుత్వం గుడ్ న్యూస్!

AP Government Good News For Salaar: సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మేకర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.

AP Government Good News For Salaar: సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మేకర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.

సలార్ టీమ్ కి AP ప్రభుత్వం గుడ్ న్యూస్!

ప్రస్తుంత రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా సలార్ ఫీవర్ కనిపిస్తోంది. అందరూ సలార్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డార్లింగ్ ప్రభాస్ సలార్ సినిమా సందడి మూడ్రోజుల ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే టికెట్స్ కోసం ఫ్యాన్స్ బుక్ షో వంటి యాప్స్ లో కుస్తీలు పడుతున్నారు. టికెట్స్ రిలీజ్ చేస్తున్న నిమిషాల వ్యవధిలోనే థియేటర్ హౌస్ ఫుల్ అయిపోతున్నాయి. మరి ప్రభాస్ సినిమా అంటే ఆమాత్రం ఉంటుంది. ఈ ఘటనలు చూసి మేకర్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలార్ టీమ్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది.

ప్రభాస్- ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ సినిమాకి వరల్డ్ వైడ్ క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది. టికెస్ట్ కోసం ఫ్యాన్స్ యుద్ధాలే చేస్తున్నారు. బుక్ మైషోలో టికెట్స్ రిలీజ్ కాగానే సైట్ క్రాష్ అయ్యిందంటే అర్థం చేసుకోవాలి ఏ లెవల్ రెస్పాన్స్ వస్తోంది అనేది. ఇలాంటి తరుణంలో సలార్ సినిమా టీమ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శుభవార్తను చెప్పింది. డిస్ట్రిబ్యూటర్స్ విజ్ఞప్తి మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో సలార్ సినిమా టికెట్స్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే కేవలం 10 రోజులు మాత్రమే పెంచిన ధరకు టికెట్స్ అమ్మాలని తెలిపింది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు అదనంగా రూ.40 వరకు పెంచుకునేందుకు సలార్ టీమ్ కి ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో టు మేకర్స్ మాత్రమే కాదు.. ఇటు ఫ్యాన్స్ కూడ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం మరింత తేలిక అవుతుందని.

AP GOVT hike ticket price for salaar

ఇప్పటికే రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో వైలెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతోందో చెప్పడానికి.. ఈ మూవీకి వచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ సరిపోతుంది. ఎందుకంటే ఏ రేంజ్ లో వైలెన్స్ లేకపోతే సెన్సార్స్ బోర్డు ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ జారీ చేస్తుంది. అంటే కేవలం పెద్దవాళ్లు మాత్రమే ఈ సినిమా చూడాలని సెన్సార్స్ బోర్డు నిర్ణయించింది. ఈ చిత్రంలో హింస కట్టలు తెంచుకునే ఉంటుందని అర్థమైపోతోంది. ప్రాణ మిత్రుడు అడిగింది ఏదైనా తెచ్చి ఇచ్చే ఆప్త మిత్రుడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ ని డైనోసార్ తో పోలుస్తూ చిత్ర బృందం, ఫ్యాన్స్ పోస్టులు చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ స్థాయిలో వచ్చిన హైప్ కి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ బద్దలు కావడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా సరైన హిట్టు కోసం ప్రభాస్ కూడా వెయిట్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఫిక్స్ అయిపోయారు. అందుకే సంబరాలు చేసుకునేందుకు వెన్యూలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి