Arjun Suravaram
Arjun Suravaram
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఆరోగ్యానికి కాపాడుకునేందుకు అనేక రకాల వ్యాయమాలు చేస్తుంటారు. అలాంటి వాటిలో స్విమ్మింగ్ కూడా ఒకటి. అయితే కొందరు ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు అరుదైన ఫీట్స్ కూడా చేస్తుంటారు. కేవలం యువతే కాకుండ పెద్ద వయస్సుకు కూడా సాహసాలు చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ప్రజాప్రతినిధులు సైతం.. వివిధ రకాల సాహసాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పలు సాహసా క్రీడలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అరుదైన ఫీట్ చేశారు. 64 ఏళ్ల వయస్సులో గంటపాటు నీటిలో యోగాసనాలు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంగళవారం జూలై 11 నేషనల్ స్మిమ్మింగ్ ఫూల్ డేను విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. అలానే ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని నేషన్ స్మిమ్మింగ్ పూల్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కి ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతలో క్రీడల ఆవశ్యకత గురించి డిప్యూటీ స్పీకర్ వివరించారు. ఈ సందర్భంగా స్విమ్మింగ్ పూల్‌లో ఆయన యోగాసనాలు వేశారు. కాళ్లు, చేతులు కదిలించకుండా గంటపాటు తేలియాడారు. వయసును సైతం లెక్క చేయకుండా కోలగట్ల వీరభద్ర స్వామి ఈ సాహసం చేశారు. 64 ఏళ్ల వయస్సులో గంటపాటు నీటిలో అలా యోగాసన వేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కోలగట్ల సాహసాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు పీడిక రాజన్న దొర, బొత్స సత్యనారాయణలు అభినందించారు. క్రీడా రంగ విశిష్టతను, క్రీడల ప్రాధాన్యతను యువతరానికి తెలియజేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించామని మంత్రులు తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ చేపట్టిన జలాసన కార్యక్రమాన్ని వీక్షించేందుకు స్థానికులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయన చేసే సాహసాన్ని వారు వీక్షిచడం కోసం ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ అరుదైన ఫీట్‌తో ఆకట్టుకున్న కోలగట్లకు అందరూ అభినందనలు తెలిపారు. మొత్తం మీద వీరభద్రస్వామి తన అరుదైన ఫీట్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యాని రక్షించుకునేందుకు పలు సూచనలు చేశారు. అలానే వయసుతో సంబంధం లేని క్రీడ.. స్విమ్మింగ్ అని, దీనిని రోజూ సాధనం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చుని ఆయన తెలిపారు. మరి.. ఏపీ డిప్యూటీ స్పీకర్ చేసిన ఈ సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.