Arjun Suravaram
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..ప్రజల కోసం అనేక రకాల పథకాలను ప్రవేశ పెట్టారు. వారు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో సీఎం ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఇక ప్రజల సంబంధించిది.. వారి ఆరోగ్యం విషయంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. ఆరోగ్య శ్రీ పథకం, సీఎం సహాయ నిధి వంటి వాటి ద్వారా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. అన్న..మమల్ని ఆదుకోండి అని పిలిస్తే చాలు.. వెంటనే సీఎం జగన్ స్పందిస్తుంటారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో బాధ పడుతున్న వారికి నేనున్నానంటూ సీఎం భరోసా ఇచ్చారు. తాజాగా పల్నాడు జిల్లాలోని కొందరు సీఎం జగన్ ని కలిసి.. తమ ఆవేదనను చెప్పుకున్నారు.
అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి ముఖ్యమంత్రి జగన్ నేనున్నానంటూ అండగా నిలిచారు. తలసేమియాతో బాధ పడుతున్న విజయవాడకు చెందిన దుర్గాభవానీ సీఎం జగన్ వద్ద తన ఆవేదనను తెలియజేసింది. అలానే సీతారామ్ దంపతుల కుమారుడు గౌతమ్ వెంకట్, బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్న పల్నాడు జిల్లా రొంపిచర్ల కు చెందిన సూర్య ఆదిత్య రెడ్డి, మానసిక స్థితి సరిగ్గాలేని దుగ్గిరాలకు చెందిన నాగూర్ తో పాటు కుమార్తె త్రివేణి లు.. వెంకటపాలెం వద్ద సీఎం జగన్ ను కలిసి.. వారి గోడు వెల్లబోసుకున్నారు. ఇక ప్రతి ఒక్కరి కష్టాలను ఎంతో ఓపికగా సీఎం జగన్ విన్నారు. అలానే వారు ఇంకా అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. తక్షణ ఆర్థిక సాయంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గంటల వ్యవధిలేనే ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు బాధితులకు ఆర్ధిక సాయం అందజేశారు.
అలానే త్వరలోనే మెరుగైన వైద్యం అందిస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు అన్నారు. పేద ప్రజల బాధలను అర్ధం చేసుకోవడంలో తండ్రికి తగ్గ తనయుడని సీఎం జగన్ ను పలువురు ప్రశించారు. పేదవాళ్లు కష్టాల్లో ఉంటే వైఎస్ ఫ్యామిలీ చూడలేదని మరికొందరు అభిప్రాయ పడ్డారు. తండ్రి బాటలోనే నడుస్తూ.. ప్రతి పేద వాడి కష్టాలను సీఎం జగన్ తీస్తున్నారు. అన్నా.. అని సాయం కోసం వచ్చిన పేదలను, ఇతర వర్గాల వారికి నేనున్నానంటూ సీఎం జగన్ భరోసా కల్పిస్తున్నారు. ఇలా పేదల కష్టాలను తెలుసుకుని, వాటిని తొలగిస్తూ.. వాళ్లు ఆర్ధికంగా బలంగా ఉండేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఇలా తనదైన పరిపాలనతో సీఎం జగన్ ప్రజల గుండె సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మరి.. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి సీఎం చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్!