iDreamPost

గిరిజన ప్రాంత వాసులకు శుభవార్త..300 సెల్ టవర్స్ ప్రారంభం!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. అలానే మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు. తాజాగా గిరిజన ప్రాంత వాసులకు సీఎం జగన్ ఓ గుడ్ న్యూస్ అందించారు.

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. అలానే మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు. తాజాగా గిరిజన ప్రాంత వాసులకు సీఎం జగన్ ఓ గుడ్ న్యూస్ అందించారు.

గిరిజన ప్రాంత వాసులకు శుభవార్త..300 సెల్ టవర్స్ ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలో వెళ్లేలా కృషి చేస్తున్నారు. మాముల ప్రాంతాల్లో ఉన్నవారు సైతం అభివృద్ధి చెందాలని బలంగా కోరకునే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈక్రమంలోనే గిరిజన ప్రాంతాల వాసుల కోసం అనేక పథకాలను, అభివృద్ధి కార్యక్రామాలను ప్రారంభించారు. అంతేకాక ఇక్కడి ప్రజలకు టెలికాం సేవలను సమర్థవంతంగా అందించాలని భావించారు. ఈక్రమంలోనే తాజాగా గిరిజన ప్రాంత వాసులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ అందించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ టవర్లను ప్రారంభించారు. గురువారం సీఎం క్యాప్ ఆఫీస్ నుంచి వర్చవల్ విధానంలో ఈ సెల్ టవర్లను సీఎం జగన్ ప్రారంభించారు.

గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో సెల్ టవర్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారభించారు. మారుమూల గిరిజిన ప్రాంత వాసులకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లను ఏర్పాటు చేశారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ప్రారభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశం జిల్లాలో 4, ఏలూరులో శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్ ఏర్పాటయ్యాయి.

ఇక ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇవాళ్ల  300 సెల్ టవర్లు, జూన్ లో 100 టవర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందుకోసం దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారని సీఎం జగన్ తెలిపారు. 400 టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరం, నేడు ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగమని సీఎం తెలిపారు. ఇలా మొత్తంగా 2887 సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నాని, అలానే  రూ.3,119 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. టవర్లకు నిర్మాణానికి  అవసరమైన భూములను వెంటనే టెలికాం సంస్థలకు కేటాయించామని సీఎం తెలిపారు. వీటి ద్వారా 5,549 గ్రామాలకు పూర్తి స్థాయిలో మొబైల్ టెలికాం సేవలు అందుతాయన్నారు. ఇప్పటి వరకు సెల్ సిగ్నల్ లేని అత్యంత మారుమూల ప్రాంతాలు  నెట్ వర్క్ పరిధిలోకి వస్తాయని సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు.

ఇన్నాళ్లు ఫోన్లకు దూరంగా ఉన్నా..సెల్ ఉన్నా సిగ్నల్ రాక ఇబ్బంది పడ్డ గిరిజనలుకు ఇకపై సిగ్నల్స్ బాగా వచ్చేస్తాయని ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రింగ్ ట్రింగ్ మంటాయన్నారు. దీంతో వేగంగా, పారదర్శకంగా పనులు ముందుకు సాగుతాయని సీఎం జగన్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉండే గ్రామ సచివాలయాలు, విలేజి క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, ఇంగ్లిష్ మీడియం స్కూల్స్  లో మెరుగైన సిగ్నల్స్ వ్యవస్థ ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటుచేసిన సెల్ టవర్ల ద్వారా గ్రామ రూపురేఖలు మారుతాయని  సీఎం వెల్లడించారు. ఆన్ లైన్ సేవలు మరింత బలోపేతం అవుతాయని సీఎం జగన్ పేర్కొననారు.  గిరిజన ప్రాంతాల్లో టెలికాం సేవలు కారణంగా ఇవి మరింత బలోపేతంగా నడుస్తాయమని సీఎం తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి