iDreamPost

స్థానిక సంస్థల ఎన్నికలపై “నిఘా”

స్థానిక సంస్థల ఎన్నికలపై “నిఘా”

స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు,మద్యం పంచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా తొలి అడుగులు వేశారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం,డబ్బు పంపిణీ పర్యవేక్షణకు నిఘా ఆప్ ను సీఎం జగన్ ప్రారంభించారు.

నిఘా యాప్ సహాయంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని జగన్ భావిస్తున్నారు.. మద్యం డబ్బు పంపిణీతో పాటు ఎలాంటి అక్రమాలపైనైనా పిర్యాదు చేసే అవకాశం ఈ యాప్ ద్వారా కల్పించారు.. ఎవరైనా సరే యాప్ ని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ను కూడా కల్పించారు. నిఘా యాప్ ద్వారా చేసిన పిర్యాదులు నేరుగా సెంట్రల్ కంట్రోల్ రూమ్ కి చేరే ఏర్పాటు చేసారు. ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఎన్నికల్లో జరిగే అక్రమాలపై పిర్యాదు చేసే అవకాశం కల్పించినందుకు పలువురు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అభినందిస్తున్నారు.

Read Also: వైసీపీ డబ్బు,మద్యం పంపిణీ చేస్తే ఫోటోలు తీసి పంపండి – చంద్రబాబు

గతంలో వైసీపీ తరపున ఎవరైనా మద్యం,డబ్బును పంచితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నదే తన ధ్యేయమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.. కాగా వైసీపీ తరపున ఎవరైనా డబ్బు, మద్యం పంపిణి చేస్తే ఎన్టీర్ భవన్ లో ఉన్న కంట్రోల్ రూమ్ కి వీడియోలు, ఫోటోలు పంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలకు నేతలకు సూచించారు.

నిఘా యాప్ ని పారరంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా ఓటర్లపై డబ్బు మద్యం ప్రభావం చూపకుండా నిర్వహించాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం సరైనదో కాదో మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి