iDreamPost

ముగిసిన AP కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం!

AP Cabinet: శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు.

AP Cabinet: శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు.

ముగిసిన AP కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం!

త్వరలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలు అన్ని ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు  అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అంతేకాక రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మంత్రివర్గ సమావేశాలు జరుగుతుంటాయి. ఈ భేటీల్లో అనేక కీలక అంశాలకు అమోదం తెలిపి.. అమలు చేస్తుంటారు. తాజాగా శుక్రవారం కూడా ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని కేబినెట్ సమావేశ మందిరంలో ఈ మీటింగ్ జరిగింది. సుదీర్ఘ సమయం పాటు ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. పెన్షన్, ఆరోగ్యశ్రీ, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల, లైట్ మెట్రో వంటి పలు  కీలక అంశాపై మంత్రి వర్గం చర్చించింది. మొత్తంగా ఏపీ కేబినెట్ 45 అంశాలపై  చర్చించింది. ఈ నేపథ్యంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి.. ఆమోదం తెలిపింది. మిచౌంగ్‌ తుపాను బాధితులకు నష్ట పరిహారం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెన్షన్‌ రూ. 3 వేలకు పెంపు నిర్ణయానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు పెన్షన్ రూ.2,750 గా ఇస్తున్నారు.

అది జనవరి 2024 నుంచి రూ.3 వేలు ఇవ్వనున్నారు. అలానే ఆరోగ్య శ్రీని కూడా రూ. 5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీలో సంస్కరణలకు మంత్రి వర్గం ఆమోదం వేసింది. ఈనెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణికి ఆమె తెలిపారు.YSR ఆరోగ్యశ్రీపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. జగనన్న సురక్ష రెండో విడతకు కేబినెట్ ఆమోదించింది. విశాఖలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ కి ఆమోదం తెలిపారు. మరి.. మంత్రివర్గం ఆమోదం తెలిపిన అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి