iDreamPost

నేను లవ్‌లో ఉన్నాను.. కానీ.. తన ప్రేమ గురించి బయటపెట్టిన అనుపమ పరమేశ్వరన్..

నేను లవ్‌లో ఉన్నాను.. కానీ.. తన ప్రేమ గురించి బయటపెట్టిన అనుపమ పరమేశ్వరన్..

మలయాళ ‘ప్రేమమ్‌’ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌. తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ పేరు తెచ్చుకుంది అనుపమ. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటూ తన ఫోటోలని పోస్ట్ చేస్తూ అభిమానులని రోజు రోజుకి పెంచుకుంటుంది. ఇటీవలే రౌడీబాయ్స్ సినిమాలో లిప్ కిస్, రొమాన్స్ సీన్స్ తో మరింత డోసు పెంచింది అనుపమ. ప్రస్తుతం అనుపమ తెలుగులో కార్తికేయ 2, 18 పేజీస్‌, బటర్‌ ఫ్లై సినిమాలు చేస్తుంది.

తాజాగా ఈ మలయాళ భామ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి, ప్రేమపై ఉన్న అభిప్రాయం గురించి తెలిపింది. అనుపమ ప్రేమపై తనకున్న అభిప్రాయం గురించి మాట్లాడుతూ.. నాకు లవ్‌ మ్యారేజ్‌పై మంచి అభిప్రాయమే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా మంది కపుల్స్‌ను చూస్తుంటే చాలా బాగుంటుంది. నాకు కూడా ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఉంది. మా పేరేంట్స్‌కు కూడా చెప్పేశాను నేను పెళ్లి చేసుకుంటే ప్రేమ పెళ్లి చేసుకుంటాను అని. అందుకు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అని తెలిపింది.

ఇక తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. నేను సింగిల్‌ కాదు. కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటో నాకే సరిగ్గా తెలియట్లేదు. నేనైతే ప్రేమలో ఉన్నాను. అవతలి సైడ్‌ నుంచి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నేను నోరు తెరిచి ఇంకా చెప్పలేదు. ప్రస్తుతం నాది వన్‌ సైడ్‌ లవ్‌ అని తెలిపింది అనుపమ పరమేశ్వరన్‌. మరి అనుపమ లవ్ చేస్తున్న ఆ లక్కీ పర్సన్ ఎవరో అని అంతా ఆలోచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి