iDreamPost

Ante Sundaraniki సరదాగా నడిపించే సుందరం సమస్య

Ante Sundaraniki సరదాగా నడిపించే సుందరం సమస్య

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి జూన్ 10న విడుదల కాబోతోంది. ఇవాళ ఏఎంబి మాల్ వేదికగా టీజర్ లాంచ్ ని గ్రాండ్ గా చేశారు. నిడివి మాత్రం ట్రైలర్ అంత ఉంది. అంటే మరొకటి వచ్చే నెల వదులుతారేమో చూడాలి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురాతో ప్రేక్షకుల మెప్పు పొందిన వివేక్ ఆత్రేయ టేకింగ్ మీద హోమ్ ఆడియన్స్ లో మంచి గురి ఉంది. అందులోనూ నాని మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. భారీ చిత్రాలతో సందడి చేసే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ కామెడీ కం లవ్ ఎంటర్ టైనర్ లో అసలు మ్యాటర్ ఏముందో చూద్దాం.

సుందరం(నాని)ది సంప్రదాయాలు నిష్టగా పాటించే కుటుంబం. ఈ భావాలు అతని తండ్రి(నరేష్)లో చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతిదానికి జ్యోతిష్యాలు, స్వాములు, తాయెత్తులు అంటూ తిప్పుతూ ఉంటాడు. దీనివల్లే సుందరం ఇంటా బయటా ఇబ్బందులు పడుతూ ఏదో నెట్టుకొస్తుంటాడు. అప్పుడు పరిచయమవుతుంది ఓ అందమైన అమ్మాయి(నజ్రియా). ఫోటోగ్రఫీ చేసే ఆమెది క్రిస్టియన్ ఫ్యామిలీ. వీళిద్దరి పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. రెండు వైపులా తెలిశాక భగ్గుమంటారు. ఇదంతా ఒక ఎత్తైతే సుందరానికి మరో సమస్య ఉంటుంది. అదేంటో బయట ఎవరికి తెలియదు. మరి ఈ ప్రేమకథ ఎక్కడికి చేరుకుందో సినిమాలో చూడాలి.

వివేక్ తీసుకున్న ఇంటర్ క్యాస్ట్ కాన్సెప్ట్ లో సీరియస్ నెస్ ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ మాత్రం చాలా సరదాగా నడిపించారు. హాస్యానికి ప్రాధాన్యత ఇచ్చి మనకు చెప్పని సమస్య చుట్టూ ఎంటర్ టైన్మెంట్ కోటింగ్ ఇచ్చారు. నాని ఎక్స్ ప్రెషన్లు, నజ్రియా అందం ఈ జోడి మీద మంచి అంచనాలు కలిగేలా చేశాయి. ఎప్పుడో రాజా రాణి తర్వాత నజ్రియాను చూడటం ఇదే. వివేక్ సాగర్ సంగీతం, నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం మంచి స్టాండర్డ్ లో ఉన్నాయి. చాలా కాలం తర్వాత హిందూ క్రిస్టియన్ లవ్ స్టోరీని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న వివేక్ ఆత్రేయ దాన్ని నవ్వుకునేలా మలిచిన తీరు ఏ మేరకు మెప్పించనుందో జూన్ 10న తేలనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి