iDreamPost

Ante Sundaraniki : ఏడు రిలీజ్ డేట్లను అందుకే బ్లాక్ చేశారు

Ante Sundaraniki : ఏడు రిలీజ్ డేట్లను అందుకే బ్లాక్ చేశారు

టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల జాతర జరుగుతోంది. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాక ఒక్కొక్కరు రెండేసి తేదీలను ప్రకటించేస్తున్నారు. రాజమౌళి ఈ ట్రెండ్ ని మొదలుపెట్టగా ఇప్పుడు అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు. భీమ్లా నాయక్, గని, రామారావు ఆన్ డ్యూటీ ఆల్రెడీ ఆ పని చేసేయగా నాని కొత్త సినిమా అంటే సుందరానికి ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా 7 డేట్లను అనౌన్స్ చేసి ఈ ట్రెండ్ మీద గట్టి సెటైర్ వేసింది. ఏదో ఒక రోజు వస్తామనే సందేశం ఇందులో ఉన్నా మీరు రెండు చేస్తే మేము ఏడు చేయకూడదా అనే వంగ్యం దానికి జోడించారు. ఇది ఆర్ఆర్ఆర్ కు మాత్రమే కాదు అందరికీ చురకలా అనిపించింది

ఇలా చేయడం తప్పా ఒప్పా అనేది పక్కన పెడితే ఈ ధోరణి ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ఫలానా డేట్ రాలేకపోతే అప్పుడు మార్చుకోవాలి కానీ ఈ రెండు నావి లేదా ఈ ఏడు నావి అని ముందే కర్చీఫ్ వేసుకోవడం చిన్న సినిమాలను ఇబ్బంది పెట్టేదే. రిలీజుల విషయంలో క్లారిటీ ఉంటే మిగిలిన నిర్మాతలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫలానా పెద్ద మూవీ తప్పుకుంది కాబట్టి అప్పటికప్పుడు వచ్చేద్దాం అనుకునే సీన్ అంత ఈజీగా ఉండదు. ఈ కారణం వల్లే శేఖర్, డిజె టిల్లు లాంటివి కొన్ని మంచి డేట్లను వదులుకోవాల్సి వచ్చింది. దీనివల్ల గత నలభై రోజుల్లో ఒకే హిట్టు(బంగార్రాజు) నమోదయ్యింది

ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడీ ట్రెండ్ కి అడ్డుకట్ట వేసే ఆలోచనా చేస్తారా లేక అందరూ ఇదే కంటిన్యూ చేయండని వదిలేస్తారా వేచి చూడాలి. రాబోయే జూన్ వరకు ఫలానా సినిమా ఫలానా డేట్ కి ఖచ్చితంగా విడుదలవుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. బడ్జెట్ తో సంబంధం లేకుండా అందరిదీ ఇదే పరిస్థితి. గత ఏడాది ఏపి తెలంగాణలో సగం సీట్ల ఆక్యుపెన్సీలోనూ కొన్ని సినిమాలు బాగా ఆడి డబ్బులు తెచ్చాయి. కానీ ఇప్పుడా ఆంక్ష ఒక్క రాష్ట్రంలోనే ఉన్నా ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు. ఏదైతేనేం అంటే సుందరానికి ఒక ఆలోచనకు నాంది పలికాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్ గా చేసింది

Also Read : Son Of India : మోహన్ బాబు సినిమాకు ప్రమోషన్ ఎప్పుడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి