iDreamPost
android-app
ios-app

‘యానిమల్’ ప్రమోషన్స్​లో రణ్​బీర్ ఎమోషనల్.. అది తీరని లోటు అంటూ..!

  • Author singhj Published - 08:08 PM, Wed - 29 November 23

‘యానిమల్’ ప్రమోషన్స్​లో ఫుల్ బిజీగా ఉన్నాడు హీరో రణ్​బీర్ కపూర్. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన జీవితంలో అదే తీరని లోటు అన్నాడు.

‘యానిమల్’ ప్రమోషన్స్​లో ఫుల్ బిజీగా ఉన్నాడు హీరో రణ్​బీర్ కపూర్. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన జీవితంలో అదే తీరని లోటు అన్నాడు.

  • Author singhj Published - 08:08 PM, Wed - 29 November 23
‘యానిమల్’ ప్రమోషన్స్​లో రణ్​బీర్ ఎమోషనల్.. అది తీరని లోటు అంటూ..!

యానిమల్ సినిమా విడుదల సందర్భంగా మొన్నీమధ్య హైదరాబాద్ సిటీలో జరిగిన ప్రెస్ మీట్​లో హీరో రణ్​బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా పాల్గొన్నారు. అప్పుడు జరిగిన క్యూ అండ్ ఊ సెషన్​లో రణబీర్ తన గతాన్ని ఒక్కసారిగా గుర్తుచేసుకొని ఉద్వేగానికి గురయ్యాడు. ఐడ్రీమ్ ఛానెల్ ప్రతినిధి రిషికపూర్​తో రణ్​బీర్​కు ఉన్న కెమిస్ట్రీ గురించి ప్రశ్నించగా.. రణ్​బీర్ ఆ క్షణంలో గతంలోకి వెళ్లిపోయాడు.

‘నా చిన్నప్పుడు మా ఫాదర్​ను బాగా మిస్సయ్యాను. ఆయనెప్పుడూ షూటింగ్స్ లో బిజీగా ఉండేవారు. డబుల్ షిప్టులు, త్రిబుల్ షిప్టులు. ఎప్పుడు పడితే అప్పుడు ట్రావెలింగ్. నాకు బొత్తిగా చిక్కేవారే కాదు. ఫాదర్ అంటే అందరికీ చాలా గౌరవం ఉంటుంది. కానీ ఫాదర్ పోయిన తర్వాత ఆయనతో ఎక్కువసేపు గడపలేకపోయామే అనే విచారం జీవితాంతం వెంటాడుతుంది. అది నాకు తీరని లోటు. కొన్నాళ్ల కింద మా ఫాదర్ పోయారు. అదే నా జీవితంలో ఎక్కువ బాధను మిగిల్చింది. నాకే కాదు.. ఈ బాథ చాలా మంది జీవితాల్లో ఉంటుందని అనుకుంటున్నాను. ఇటువంటి ఫాదర్ అండ్ రిలేషన్ చాలా ప్రత్యేకమైనది. చాలా కాంప్లికేటెడ్ కూడా. అటువంటి కాంప్లికేటెడ్ రిలేషన్​ను ఓ కథగా మలచి.. మా అందరి చేత పర్ఫెక్ట్​గా చేయించి.. పండించిన క్రెడిట్ మాత్రం ఒక్కరికే చెందుతుందని గట్టిగా చెప్పగలను. ఆ ఒక్కరే సందీప్ రెడ్డి వంగా’ అని ఎమోషనల్ అయ్యాడు రణ్​బీర్.

కూతురు రాహ గురించి కూడా రణ్​బీర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహతో గడపడానికి తను సినిమాలైనా వదిలేసుకుంటానని చెప్పాడు. ‘మా జీవితాల్లోకి కొత్తగా వచ్చిన గొప్ప ఆనందం రాహ. తనతో గడపడానికి సినిమాలు, ప్రొఫెషన్ కూడా వదులుకోవడానికి నేను సిద్ధమే. కానీ వదులుకోలేను. రెండింటి మధ్యలోనే నా జీవితం ఇరుక్కుపోయింది. ఏం చేయడం’అని వాపోయాడు పాపం రణ్​బీర్. మరి.. కూతురు కోసం సినిమాలు వదిలేసుకోవడానికీ రెడీ అంటూ ఈ హీరో చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: లియో నేర్పిన పాఠం! ప్రశాంత్ నీల్ సీక్రెట్ రివీల్ చేసేశాడు!

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş