iDreamPost

బాబును అడగాల్సింది రాధాకృష్ణా..!

బాబును అడగాల్సింది రాధాకృష్ణా..!

తెలుగు పత్రికల్లో నిష్పాక్షిత ఎడారిలో ఎండమావి లాంటిదే. అయితే తమను మోసే వారికి మేలు చేయడం కోసం.. వారి చేసిన పాపాలను కూడా వారి ప్రత్యర్థుల ఖాతాలో వేయడమనే సరికొత్త విధానం తెలుగు పత్రికలు కొన్నింటిలో కనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును వెనకేసుకువచ్చేందుకు ఆంధ్రజ్యోతి రాస్తున్న రాతలు 90వ దశకం జర్నలిస్టులు చూస్తే ఆశ్చర్యపోతారు. జర్నలిజం ఇంతలా బ్రష్టుపట్టిందా..? అని నిర్వేదం వ్యక్తం చేయకుండా ఉండలేరు.

ఈ రోజు ఆంధ్రజ్యోతి బ్యానర్‌ కథనంగా రాసిన ఉద్యోగులకు డీఏ బకాయిల అంశం.. పూర్తిగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి ముడిపెడుతూ.. ఆంధ్రజ్యోతి వండివార్చిన విధానం హాస్యాస్పదంగా ఉంది. కథనం చదివితే చాలు చంద్రబాబు చేసిన పాపాలను ఆంధ్రజ్యోతి రాధా కృష్ణ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి అంటగడుతున్నాడేమి.. అనే ఆలోచన రాక మానదు.

ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వం 12000 కోట్ల రూపాయల డీఏ బాకీ పడిందంటూ ఆంధ్రజ్యోతి రాసింది. పాతవి రెండు. కొత్తవి నాలుగు అంటూ నర్మగర్భంగా చెప్పుకొచ్చింది. అయితే కథనంలో పేర్కొన్న గణాంకాలు చూస్తే.. ఆంధ్రజ్యోతి చేసిన ఘనకార్యం తెలిసిపోతోంది. 12 వేల కోట్ల రూపాయలు డీఏ బకాయలు ప్రభుత్వం బాకీ పడిందని చెప్పిన ఆంధ్రజ్యోతి.. అందులో జగన్‌సర్కార్‌ వచ్చిన తర్వాత చెల్లించాల్సిన బకాయలను వేరుగా పేర్కొనకుండా.. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా వైసీపీ ప్రభుత్వ ఖాతాలో వేసింది.

2018 జూలైలో 3000 కోట్లు, 2019 జనవరిలో 3000 కోట్ల, జూలైలో 2,400 కోట్లు, 2020 జనవరిలో 1,800 కోట్లు, జూలైలో 1,200 కోట్లు, 2021 జనవరిలో 600 కోట్లు వెరసి 12 వేల కోట్ల రూపాయలు డీఏ బకాయిలు ఉన్నాయని పేర్కొంది. 12 వేల కోట్ల రూపాయల్లో 8,400 కోట్ల రూపాయలు గత చంద్రబాబు ప్రభుత్వం హాయంలో చెల్లించాల్సినవి. అయితే ఈ విషయం ఎక్కడా పేర్కొనని ఆంధ్రజ్యోతి.. బాబు పాపాలను కూడా జగన్‌ఖాతాలో వేసింది. పైగా.. ఈ 12 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం అసలు ఏం చేసింది..? అంటూ ప్రశ్నిస్తోంది. ఆ నిధులును ఎటు మళ్లించిందో ప్రశ్నార్థకమేనంటూ రాసుకొచ్చింది. ఈ ప్రశ్న ఆంధ్రజ్యోతి అడగాల్సిన వారిని అడిగితే సమాధానం లభిస్తుంది.

Also Read : కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు భవిష్యత్తేమిటో..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి