iDreamPost

ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్ల పరువునష్టం దావా

ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్ల పరువునష్టం దావా

ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యానికి బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యస్వామి షాకిచ్చారు. ఏపీ ప్రభుత్వాన్ని సీఎం వైఎస్‌జగన్‌ను ఇబ్బంది పెట్టేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై ఆంధ్రజ్యోతి పలు కథనాలు రాసింది. వాటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుబ్రమణ్య స్వామి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు ఆంధ్రజ్యోతి ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబే ఆంధ్రజ్యోతితో ఇలాంటి కథనాలు రాయిస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ విషయంపై తాను న్యాయస్థానంలో పోరాటం చేస్తానని ఇటీవల పేర్కొన్నారు.

చెప్పిన మేరకు సుబ్రమణ్యస్వామి ఆంధ్రజ్యోతిపై న్యాయస్థానాల్లో పోరాటానికి సిద్ధమయ్యారు. అసత్య కథనాలతో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసిన నేపథ్యంలో 100 కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. ఏపీలో వైఎస్‌జగన్‌ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతపరమైన అంశాలపై కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారు.

Also Read:ఆ మున్సిపాలిటీలో వైసీపీ గెలుపు ఖాయం కానీ చైర్మన్ అభ్యర్ధీ గెలిచేనా ?

తిరుమలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నారని, ఏడు కొండలపై శిలువ ఏర్పాటు చేశారని, వైవీ సుబ్బారెడ్డి హిందువు కాదని.. ఇలా అనేక రకాల ప్రచారం సాగించారు. ఈ ప్రచారాన్ని శ్రీవారి భక్తుడైన సుబ్రమణ్యస్వామి ఎప్పటికప్పుడు ఖండించేవారు. అయినా ఆంధ్రజ్యోతి వైఖరి మారకపోవడంతో ఈ సారి ఏకంగా వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు.

పరువు నష్టం దావా వేసిన విషయాన్ని సుబ్రమణ్య స్వామి వెల్లడించారు. ఆంధ్రజ్యోతి కావాలనే టీటీడీపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు తమను కాపాడతారనే భావన లో ఆంధ్రజ్యోతి ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. బాబు ఓడిన తర్వాత మరోలా ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తోందని సుబ్రమణ్యస్వామి విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే సహించేది లేదని హెచ్చరించారు. కుట్రపూరితంగానే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్వామి మండిపడ్డారు. తాను దాఖలు చేసిన పరువునష్టం కేసుల్లో ఎప్పుడూ ఓడిపోలేదని గుర్తు చేసిన సుబ్రమణ్యస్వామి.. ఈ కేసులో విషయంలో తాను ఎంత సీరియస్‌గా ఉన్నానో చెప్పకనే చెప్పారు. మొత్తం మీద సుబ్రమణ్యస్వామి వల్ల ఆంధ్రజ్యోతి యాజమన్యానికి చిక్కులు తప్పేలా లేవు.

Also Read :మున్సిపల్‌ వార్‌.. తాడిపత్రిలో ఏం జరుగుతోంది…?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి