iDreamPost

వైఎస్‌ జగన్‌ గురించి ఆంధ్రజ్యోతి ఇలా రాయడం ఆశ్చర్యమే..!

వైఎస్‌ జగన్‌ గురించి ఆంధ్రజ్యోతి ఇలా రాయడం ఆశ్చర్యమే..!

కేంద్రంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కయ్యానికి కాలు దువ్వుతున్నారట. పోలవరం, ఇతర నిధుల మంజూరుపై కొర్రీలు వేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రిని వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌ చేసుకుందట. అందుకే ఆమె ప్రతిష్టను దెబ్బతీసేందుకు గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన గార్గ్‌ చేత ఆరోపణలు చేయిస్తున్నారట. తద్వారా కేంద్ర ఆర్థిక మంత్రిని తమ దారిలోకి తెచ్చుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందట. అప్పుల ప్రతిపాదనను అంగీకరించలేదనే నిర్మలా సీతారామన్‌ను వేసీపీ పెద్దలు టార్గెట్‌ చేశారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఈ రోజు రాసుకొచ్చింది.

మొత్తం మీద వైఎస్‌ జగన్‌ కేంద్ర ఆర్థిక మంత్రినే టార్గెట్‌ చేసి తన పని చేయించుకోవాలనుకుంటున్నారనే ఉద్దేశంతో ఉన్నారనే కోణంలో ఆంధ్రజ్యోతి కథనం రాసుకొచ్చింది. మరి ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక కొన్ని రోజులు క్రితం.. వైఎస్‌ జగన్‌ బీజేపీతో లాలూచి పడ్డారు. కేసుల మాఫీ కేసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. జస్టీస్‌ ఎన్‌వీ రమణపై సుప్రిం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై కేంద్ర హోం శాఖ మంత్రి వైఎస్‌ జగన్‌ను మందలించారు. అదిరించారు.. బెదిరించారు… అంటూ రాసుకొచ్చింది. అదే ఈ రోజు దానికి పూర్తి భిన్నంగా కథనం వండి వార్చింది. ఇక్కడే అసలు లాజిక్‌ను ఆంధ్రజ్యోతి మిస్‌ అయింది.

నిన్నటి వరకూ బీజేపీ పెద్దలు జగన్‌ను మందలించారని చెప్పుకొచ్చిన ఆంధ్రజ్యోతి ఈ రోజు మాత్రం వైఎస్‌ జగన్‌ ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను టార్గెట్‌ చేశారని చెప్పడంలో బూతద్ధం వేసి వెతికినా తర్కం కనిపించడం లేదు. ఏపీలో వైసీపీతో దోస్తీ చేసేందుకు బీజేపీ ఆసక్తి చూపుతోందన్న వార్తలొచ్చాయి. కేంద్ర మంత్రివర్గంలో చేరాలని కూడా బీజేపీ నుంచి వైసీపీకి ఆఫర్లు వచ్చాయనే చర్చ ఇటీవల సాగింది. వైసీపీ, బీజేపీ కలిస్తే.. టీడీపీ పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తుండడంతో ఆ రెండు పార్టీల మధ్య దూరం పెంచేందుకు ఆంధ్రజ్యోతి ఇలాంటి పడికట్టు కథనాలను వండి వారుస్తోందన్న విమర్శలున్నాయి. ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం లభించినా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది.

ఈ క్రమంలోనే తాజాగా పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాజెక్టు వ్యయం అంచనాలను కేంద్ర భారీగా తగ్గించి వేసింది. ప్రాజెక్టు వ్యయం, పూర్తి చేసే సమయం, విభజన చట్టంలో పోలవరం గురించి ఉన్న అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే.. పోలవరం నిధుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదమే నడుస్తోంది. దీన్ని ఆసరాగా తీసుకుని.. మండుతున్న అగ్నిపై పెట్రోల్‌ పోయాలని ఆంధ్రజ్యోతి చూస్తోంది. ఈ కోణంలోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. కేంద్ర ఆర్థిక మంత్రిని టార్గెట్‌ చేసుకుందనే కోణంలో కథనం రాసిందనే చర్చ సాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి