Somesekhar
టీమిండియాకు తానున్నానంటూ ఆశలు రేపుతూ జట్టులోకి దూసుకొద్దానికి సిద్దంగా ఉన్నాడు ఆంధ్రా కుర్రాడు విశాఖపట్నం వాసి నితీశ్ కుమార్ రెడ్డి. మరి హార్దిక్ వారసుడిగా నితీశ్ కుమార్ రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేయగలడా? ఓసారి అతడి కెరీర్ ను పరిశీలిద్దాం.
టీమిండియాకు తానున్నానంటూ ఆశలు రేపుతూ జట్టులోకి దూసుకొద్దానికి సిద్దంగా ఉన్నాడు ఆంధ్రా కుర్రాడు విశాఖపట్నం వాసి నితీశ్ కుమార్ రెడ్డి. మరి హార్దిక్ వారసుడిగా నితీశ్ కుమార్ రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేయగలడా? ఓసారి అతడి కెరీర్ ను పరిశీలిద్దాం.
Somesekhar
టీమిండియాలో ఎంతో మంది అద్భతమైన క్రికెటర్ ఉన్నారు. ప్రస్తుతం మరెంతో మంది వస్తున్నారు కూడా. అయితే టాలెంటెండ్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఓ సమస్య మాత్రం భారత జట్టును చాలా ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. ఆ సమస్య ఏంటంటే? జట్టులో నాణ్యమైన పేస్ ఆల్ రౌండర్లు లేకపోవడమే. ప్రస్తుతం మనం చూసుకుంటే.. హార్దిక్ పాండ్యా ఒక్కడే పేస్ ఆల్ రౌండర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడిప్పుడే యంగ్ ప్లేయర్ శివమ్ దుబే వెలుగులోకి వస్తున్నాడు. కానీ నికార్సైన పేస్ ఆల్ రౌండర్ మాత్రం దొరకడంలేదు. ఈ నేపథ్యంలోనే టీమిండియాకు తానున్నానంటూ ఆశలు రేపుతూ జట్టులోకి దూసుకొద్దానికి సిద్దంగా ఉన్నాడు ఆంధ్రా కుర్రాడు విశాఖపట్నం వాసి నితీశ్ కుమార్ రెడ్డి. మరి హార్దిక్ వారసుడిగా నితీశ్ కుమార్ రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేయగలడా? ఓసారి అతడి కెరీర్ ను పరిశీలిద్దాం.
హార్దిక్ పాండ్యా.. టీమిండియాలో ప్రస్తుతం కనిపిస్తున్న ఒకే ఒక్క పేస్ ఆల్ రౌండర్. అతడి తర్వాత ఎవరు? అన్న ప్రశ్నకు భారత జట్టు దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. అయితే జట్టులోకి కొత్త కొత్త ఆల్ రౌండర్లు వస్తున్నప్పటికీ.. వారు పాండ్యాలా సత్తా చాటగలరా? అన్నదే ఇక్కడ సమస్యగా మారింది. ఈ క్రమంలోనే పాండ్యా ప్లేస్ ను భర్తీ చేయగలను అంటూ ఓ యువ క్రికెటర్ దూసుకొస్తున్నాడు. హార్దిక్ వారసుడిగా వచ్చేది తెలుగు క్రికెటరే కావడం గమనార్హం. అవును పాండ్యా లాంటి పేస్ బౌలింగ్ తో, బ్యాటింగ్ తో రంజీల్లో సత్తా చాటుతున్నాడు తెలుగు కుర్రాడు, విశాఖపట్నం వాసి నితీశ్ కుమార్ రెడ్డి.
ప్రస్తుతం ఆంధ్ర జట్టుకు రంజీల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న నితీశ్.. ముంబైతో మ్యాచ్ లో ఇరగదీశాడు. తెలివైన బౌలింగ్ తో రహానే, అయ్యర్ లను బోల్తాకొట్టించాడు నితీశ్. తెలివిగా బౌలింగ్ చేయడంలో సిద్దహస్తుడు నితీశ్.. ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో తొలి రోజు 3 వికెట్లు తీసి సత్తాచాటాడు. అప్పటి వరకు ఔట్ స్వింగర్లు వేసి.. రహానే రాగానే ఇన్ స్వింగ్ వేసి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్ బలహీనతపై దెబ్బకొట్టాడు. దీంతో తొలిరోజు భారీ స్కోర్ సాధిస్తుంది అనుకున్న ముంబై జట్టు ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ 44 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
కాగా.. పేస్ ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న నితీశ్.. గతంలో తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత నాగాలాండ్ పై 345 బంతుల్లోనే ఏకంగా 441 రన్స్ కొట్టి అందరిని ఔరా అనిపించాడు. ఇక నితీశ్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ అండర్ 16 విభాగంలో దేశంలోనే బెస్ట్ క్రికెటర్ కు ఇచ్చేజగన్మోహన్ దాల్మియా అవార్డును నితీశ్ కు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా అతడి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. నితీశ్ ఆటతీరు చూస్తుంటే హార్దిక్ పాండ్యాకు సరైన వారసుడు ఇతడే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
20 year old fast bowler Nitish Kumar Reddy from Andhra, who also played for SRH in IPL 2023, dismissed Ajinkya Rahane for a duck today ! Dream come true for a youngster#RanjiTrophy pic.twitter.com/GydZNR8hDX
— Aman (@CricketSatire) January 12, 2024