iDreamPost
android-app
ios-app

నేరుగా OTTలోకి అనసూయ తమిళ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published May 13, 2024 | 5:04 PM Updated Updated May 13, 2024 | 5:04 PM

Anasuya Movie OTT Release: యాంకర్, నటి అనసూయ నటించి ప్రముఖ సినిమా నేరుగా ఓటీటీలోకి విడుదల కాబోతోంది. ఈ మూవీ థియేటర్లలో విడుదలవుతుంది అనుకున్నారు.

Anasuya Movie OTT Release: యాంకర్, నటి అనసూయ నటించి ప్రముఖ సినిమా నేరుగా ఓటీటీలోకి విడుదల కాబోతోంది. ఈ మూవీ థియేటర్లలో విడుదలవుతుంది అనుకున్నారు.

  • Published May 13, 2024 | 5:04 PMUpdated May 13, 2024 | 5:04 PM
నేరుగా OTTలోకి అనసూయ తమిళ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇప్పుడు భారతదేశంలో ఓటీటీల హవా పెరిగిపోయింది. గతంలో అంటే థియేటర్లో వచ్చిన తర్వాత సినిమా ఓటీటీలోకి వచ్చేది. కానీ, ఇప్పుడు మాత్రం అలా కాదు. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. అలా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యి.. ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాయి. ఇప్పుడు విలక్షణ నటి, యాంకర్ అనసూయ లీడ్ రోల్ ప్లే చేసిన ఒక తమిళ్ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ నిజానికి థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ, సడెన్ ఓటీటీ అంటూ షాకిస్తున్నారు. మరి.. ఆ మూవీ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోందో చూద్దాం.

యాంకర్ అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బుల్లితెర ప్రేక్షకులను కొన్నేళ్లపాటు ప్రముఖ కామెడీ షోకి హోస్ట్ గా వ్యవహరించి మెప్పించింది. ఆ తర్వాత నటిగా కూడా తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాతో రంగమత్తగా, పుష్పాలో దాక్షాయణిగా అందరినీ భయపెట్టింది. గతేడాది ఏకంగా 5 సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఒక తమిళ్ చిత్రంతో అనసూయ అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ మూవీలో ప్రభుదేవా- రెజీనా హీరోహియిన్లుగా చేస్తుండగా.. అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ మూవీ పేరు ఫ్లాష్ బ్యాక్. ఇది నిజానికి థియేటర్లలో విడుదల అవుతుందని చెప్పారు. కానీ, ఎందుకో సడెన్ గా ఫ్లాష్ బ్యాక్ మూవీ నేరుగా ఓటీటీలోకి రాబోతోంది అంటూ గట్టిగానే టాక్ స్టార్ట్ అయ్యింది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ, కోలీవుడ్ వర్గాల్లో టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో విడుదల కాబోతోంది అని చెప్తున్నారు. అలాగే ఈ మూవీ తమిళ్ లోనే కాకుండా.. తెలుగులో కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో అనసూయ కీలక పాత్రలో కనిపించబోతోంది.

ఇటీవల విడుదలైన రజాకార్ సినిమాలో చాకలి ఐలమ్మ పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ మూవీలో కూడా అనసూయ తనదైనశైలిలో యాక్టింగ్ తో మెప్పిస్తుందని చెబుతున్నారు. ప్రభుదేవా హీరోగా, రెజీనా హీరోయిన్ గా అనసూయ కీలక పాత్ర అంటే మూవీపై గట్టిగానే అంచనాలు పెరిగిపోయాయి. కథ కూడా చాలా కొత్తగా ఉంటుందని చెప్తున్నారు. మరి.. అనసూయ చిత్రం నేరుగా ఓటీటీలోకి రాబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom