iDreamPost

అనంత్‌ అంబానీ వాచ్‌పై మనసుపడ్డ జుకర్‌ బర్గ్‌ భార్య.. ఎన్ని కోట్లో తెలుసా!

  • Published Mar 04, 2024 | 10:14 AMUpdated Mar 04, 2024 | 1:58 PM

Anant Ambani Pre Wedding: అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు వచ్చిన జుకర్‌బర్గ్‌ దంపతులు.. అతడు ధరించిన వాచ్‌ మీద మనసు పడ్డారు. మరి దాని ధర ఎంతో తెలుసా

Anant Ambani Pre Wedding: అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు వచ్చిన జుకర్‌బర్గ్‌ దంపతులు.. అతడు ధరించిన వాచ్‌ మీద మనసు పడ్డారు. మరి దాని ధర ఎంతో తెలుసా

  • Published Mar 04, 2024 | 10:14 AMUpdated Mar 04, 2024 | 1:58 PM
అనంత్‌ అంబానీ వాచ్‌పై మనసుపడ్డ జుకర్‌ బర్గ్‌ భార్య.. ఎన్ని కోట్లో తెలుసా!

ఆసియా కుబేరుడు.. ఇండియలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేతే ముకేశ్‌ అంబానీ చిన్న కొడుకు అనంత్‌ అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈ ఏడాది జూలైలో అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల పెళ్లి జరగనుండగా.. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించారు. మార్చి 1-3 వరకు మూడు రోజుల పాటు.. గుజరాత్‌, జామ్‌నగర్‌ వేదికగా.. అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు ఇండియా నుంచే కాక.. ప్రపంచ దేశాల నుంచి అన్ని రంగాల ప్రముఖులు హాజరయ్యారు. జామ్‌నగర్‌ మొత్తం సెలబ్రిటీలతో నిండిపోయింది. ఇక సోషల్‌ మీడియా, మీడియా ఎక్కడ చూసినా.. అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకకు సంబంధించిన ముచ్చట్లు, ఫొటోలు, వీడియోలో దర్శనం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వీడియో మిలియన్లకు పైగా వ్యూస్‌ కొల్లగొట్టింది. ఇంతకు దానిలో ఏంది ఉంది అంటే..

3 రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా రెండో రోజు అతిథుల్ని.. అనంత్ అంబానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ అడవి వంతారా (జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం) సందర్శించే ఏర్పాట్లు చేశారు. జంగిల్ ఫీవర్ డ్రెస్ కోడ్‌లో ‘ఏ వాక్ ఆన్ ది వైల్డ్‌సైడ్’ అనే థీమ్‌తో వంతారాను సందర్శించారు సెలబ్రిటీలు. అలా వెళ్లిన వారిలో ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌, అతడి భార్య ప్రిసిల్లా కూడా. ఈ సందర్భంగా అనంత్‌ అంబానీ, జుకర్‌బర్గ్‌ భార్య మధ్య కాస్త ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియోలో జుకర్‌బర్గ్‌.. తన భార్య ప్రిసిల్లాతో కలిసి అనంత్ అంబానీతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో భార్య ప్రిసిల్లా.. అనంత్ చేతికి ఉన్న ఖరీదైన డిజైనర్ వాచ్‌ను ఆసక్తిగా పరిశీలిస్తుంది. ‘ఈ వాచ్ అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. వావ్’ అంటుంది. పక్కనే ఉన్న జుకర్‌ బర్గ్‌.. భార్య మాటలపై స్పందిస్తూ.. ఇప్పటికే అతనికి(అనంత్‌ అంబానీకి) నేను ఈ విషయం చెప్పాను అంటాడు మార్క్. అప్పుడే తనకు వాచీలంటే అస్సలు ఇష్టం ఉండదని, అసలు ధరించనని.. కానీ అంబానీ చేతి గడియారం చూస్తే మనసు మార్చుకోవాలనిపిస్తుందని అన్నారు జుకర్‌బర్గ్. ఇక ‘నాకు ఆ వాచ్ కావాలి’ అని ప్రిసిల్లా అడుగుతుంది. దానికి మార్క్ నో చెప్పడం కూడా వీడియోలో చూడొచ్చు. ఇక ఈ వాచ్ ఎవరు తయారు చేశారని ప్రిసిల్లా అడగ్గా.. రిచర్డ్ మిల్లే అని అనంత్ చెప్పారు.

అయితే అనంత్ అంబానీ ధరించిన ఆ రిచర్డ్ మిల్లే వాచ్ ఖరీదు దాదాపు రూ.14 కోట్లు ఉంటుందని అని అనుకుంటున్నారు. ఇక ఇది రోల్స్ రాయిస్ కార్ల ధరల కంటే ఎక్కువని తెలుస్తోంది. రోల్స్ రాయిస్ కార్లు రూ. 6 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి. ఈ రిచర్డ్ మిల్లే వాచ్‌ తయారీలో టైటానియం, కార్బన్ ఫైబర్, సెరమిక్స్ వంటి హై టెక్ మెటీరియల్స్ వాడుతుంటారు. ఇవి చాలా కాలం పాటు పనిచేస్తాయి.. ఇంకా తీవ్ర ప్రతికూల పరిస్థితుల్ని కూడా తట్టుకోగలవు. ఏది ఏమైనా చేతికి పెట్టుకునే వాచ్‌ ధర 14 కోట్ల రూపాయలు అంటే అంబానీ ఫ్యామిలీ సంపద ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు అంటున్నారు నెటిజనులు. జుకర్‌ బర్గ్‌ తన భార్యకు ఆ వాచ్‌ కొనివ్వను అని చెప్పడం కూడా కరెక్టే అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి