iDreamPost

చెప్పులతో కొట్టించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్

ఎన్నికల హంగామా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎలక్షన్స్ జరుగుతున్న ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యే అభ్యర్థులు.. ప్రచారాల్లో తల మునకలు అయిపోయారు. తమ విజయం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి..

ఎన్నికల హంగామా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎలక్షన్స్ జరుగుతున్న ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యే అభ్యర్థులు.. ప్రచారాల్లో తల మునకలు అయిపోయారు. తమ విజయం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి..

చెప్పులతో కొట్టించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్

తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి విదితమే. ఇప్పటికే మిజోరాంలో ఎన్నికలు ముగిసిపోయాయి. చత్తీస్ గఢ్‌లో తొలి దశ ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. నవంబర్ 17న రెండో దశ జరుగుతుంది. మధ్యప్రదేశ్‌లో కూడా నవంబర్ 17నే ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణకు ఈ నెల 30న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయా పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు శతవిథాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సుడిగాలి ప్రచారాలు చేస్తూనే.. తమకు విజయాన్ని సిద్ధించాలని గుడులు, గోపురాలు తిరుగుతున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మొక్కులు మొక్కేస్తుంటారు. ఈ దేవుడు/దేవతల్లో మహాత్యం ఉందంటే చాలు అక్కడ వాలిపోతున్నారు.

తాజాగా మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఓ వ్యక్తి చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు. ఈ వీడియో కాస్తా వైరల్ అవ్వడంతో వెలుగులోకి వచ్చింది. ఎన్నికల ముందు రోజు జరిగిన ఈ సంఘటన హల్ చల్ చేస్తోంది. ఇంతకు అతడు ఎవరంటే.. పరాస్ సక్లేచా. రత్నాం అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పరాస్.. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఫకీర్ బాబా ఆశీర్వాదం కోసం వస్తూ వెంట చెప్పులు తెచ్చుకున్నాడు. నడి రోడ్డు మీద కూర్చున్న ఓ వృద్ధ వ్యక్తికి చెప్పులు అందించి.. కొట్టించుకున్నాడు పరాస్. కొత్త చెప్పులు తీసుకు వచ్చి బాబాకు అందించి.. పరాస్ అతడి ముందు తలవంచాడు. ఓ చెప్పు తీసుకున్న బాబా.. దాంతో తలపై, ముఖంపై కొట్టాడు. పలుమార్లు కొడుతూనే ఉన్నాడు.

అయినప్పటికీ మన ఎమ్మెల్యే అభ్యర్థి చిరాకు పడకుండా, చిరు నవ్వుతో తన్నులు తిన్నాడు. అయితే అతడిని చెప్పుతో కొడుతుంటే పరాస్ అనుచరులు బాబాను వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆగకుండా ముఖంపై కొట్టాడు ఫకీర్ బాబా అని భావిస్తున్న ఆ వృద్ధుడు. ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా పరాస్ అతడి కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల వేళ ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసి పలువురు.. పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో పై  మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి