iDreamPost

‘అమ్మ ఒడి’కి నోబెల్‌ గ్రహీత ప్రశంస

‘అమ్మ ఒడి’కి నోబెల్‌ గ్రహీత ప్రశంస

విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం నోబెల్‌ బహుమతి గ్రహీత ప్రశంసలు అందుకుంది. కెమిస్ట్రీ విభాగంలో 2019 గాను నోబెల్ బహుమతి పొందిన జర్మనీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త జాన్‌ బి గుడెనఫ్‌ ఏపీ సర్కార్‌ అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకాన్ని కొనియాడారు.

అమ్మ ఒడి పథకాన్ని ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ విభాగం మేథావి గుడెనఫ్‌ దృష్టికి తీసుకెళ్లింది. మనిషి పుట్టినప్పటి నుంచి మట్టిలో కలిసేంత వరకూ ఎదో ఒకటి నేర్చుకూంటూనే ఉండాలనే తత్వాన్ని బోధించిన గుడెనఫ్‌ ఆ క్రమంలోనే మానవాళీ సౌకర్యవంతమైన జీవనానికి అనేక పరిశోధనలు చేశారు. స్మార్ట్‌ ఫోన్, కెమెరాల్లో వాడే లిథియం ఇయాన్‌ బ్యాటరీల్లో వాడే క్యాథోడ్‌ను ఈ 98 ఏళ్ల శాస్త్రవేత్తే ఆవిష్కరించారు.

కాగా, పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లలు ఆర్థిక ఇబ్బందులు వల్ల విద్యకు దూరం కాకూడదనే సదుద్ధేశంతో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లాలో సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి నుంచి నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో 15 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేసింది.

అర్హులైన వారికి వివిధ కారణాల వల్ల పథకం అందకపోతే వారికి అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22వ తేదీన మరో 1.2 లక్షల మంది తల్లులకు నగదు జమ చేసింది. వచ్చే నెల 9వ తేదీ వరకు ఈ పథకం ద్వారా లబ్ధిపొందొచ్చని ప్రభుత్వం సమయమిచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి