iDreamPost

దారుణం: చెల్లిని తుపాకీతో కాల్చి చంపిన మూడేళ్ల చిన్నారి! ఎక్కడంటే..?

దారుణం: చెల్లిని తుపాకీతో కాల్చి చంపిన మూడేళ్ల చిన్నారి! ఎక్కడంటే..?

మూడేళ్ల చిన్నారి, తుపాకీ అంటే ఎంటో కూడా తెలియని వయసు. అలాంటిది.. ఆ చిన్నారి అదే తుపాకీతో తన చెల్లిని కాల్చింది. దీంతో ఎదురుగా కూర్చున్న ఆ పాప తలలోకి బుల్లెట్ దూసుకెళ్లిది. దీంతో ఆ ఏడాది వయసున్న ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కథనం ప్రకారం.. అమెరికా కాలిఫోర్నియలో శాన్ డియాగో లో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లల సింతానం. పెద్ద కూతురికి మూడేళ్లు ఉండగా, చిన్న కూతురు ఏడాదిన్న వయసు ఉంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆ ఇద్దరు పిల్లలు ఇంట్లో ఆడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే పెద్దమ్మాయి ఇంట్లో ఉన్న గన్ తీసుకొచ్చి చెల్లి ముందు ఉంచింది. దీంతో అలా ఇద్దరు కొద్దిసేపు ఆ తుపాకీతో ఆడుకున్నారు. ఇదే సమయంలో ఆ మూడున్నరేళ్ల చిన్నారి ఒక్కసారిగా ఆ గన్ ట్రిగ్గర్ నొక్కింది.

ఇక అందులోని బుల్లెట్ ఎదురుగా కూర్చున్న పాప తలలోకి దూసుకెళ్లింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ పాప తల్లిదండ్రులు వెంటనే స్పందించి చూడగా.. ఆ చిన్నారి అప్పటికే చనిపోయిందని తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక చేసేదేం లేక వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పాప మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో దారుణం.. బీర్ బాటిల్ కోసం యువకుడిని పొడిచి చంపారు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి