iDreamPost

రూ.21 లక్షలకే సొంత ఇల్లు! అమెజాన్ అదిరే ఆఫర్!

Buy House From Amazon: సొంతింటి కల సాకారం చేసుకునే వారికి అమెజాన్ సంస్థ క్రేజీ ఆఫర్ అందిస్తోంది. కేవలం రూ.21 లక్షలకే సొంతిల్లు పొందచ్చు.

Buy House From Amazon: సొంతింటి కల సాకారం చేసుకునే వారికి అమెజాన్ సంస్థ క్రేజీ ఆఫర్ అందిస్తోంది. కేవలం రూ.21 లక్షలకే సొంతిల్లు పొందచ్చు.

రూ.21 లక్షలకే సొంత ఇల్లు! అమెజాన్ అదిరే ఆఫర్!

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దానిని సాకారం చేసుకోవడం కోసం చాలానే కష్టాలు పడుతూ ఉంటారు. అయితే ఒక మధ్యతరగతి వ్యక్తికి ఆ కలను సాధించడం అంటే ఒక పెద్ద యుద్ధం అనే చెప్పాలి. పైగా ఈరోజుల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సిటీల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలి అన్నా రూ.లక్షలు పలుకుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ఒక శుభవార్తను అందించింది. ఇక నుంచి అమెజాన్ లో వస్తువులు, గృహోపకరణాలు మాత్రమే కాకుండా.. మీరు సొంతిటి కలను కూడా సాకారం చేసుకోవచ్చు. అది కూడా కేవలం రూ.21 లక్షల్లోనే అంటూ అదిరిపోయే విషయాన్ని వెల్లడించారు.

అమెజాన్ లో దొరకనిది అంటూ ఏమీ ఉండదు. అసలు అమెజాన్ టాగ్ లైనే A-Z అని అందరికీ తెలిసిందే. సాధారణంగా ఈ దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ దుస్తులు, హోమ్ అప్లయన్సెస్, బ్యూటీ ప్రొడక్ట్స్,  ఎలక్ట్రానిక్స్, కిరాణా, క్రీడా సామాగ్రి, బొమ్మలతో పాటు అనేక వస్తు సేవలను కూడా అందిస్తారని అందరికీ తెలుసు. అయితే, తాజాగా అమెజాన్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కి షాక్ ఇచ్చే ప్రోడక్ట్ ఒకటి తన సైట్ లో ఉంచింది. అదేంటంటే హౌస్ సెల్లింగ్ ఆప్షన్. ఇల్లు ఏంటి..? అమెజాన్ లో ఏంటి..? అని షాక్ అవుతున్నారా నిజం అండి. అక్షరాలా రూ.21 లక్షల ఖర్చుతో మీరు అమెజాన్ లో మీ సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. అది కూడా అత్యాధునిక హంగులతో మీ సమయం, డబ్బు వృథా అవ్వకుండా సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు.

రియల్ ఎస్టేట్ మోసాలకు చెక్ పెట్టే విధంగా, బిల్డర్స్ మోసాల నుంచి కాపాడే విధంగా ఈ హోమ్ మోడెల్ ని రూపొందించినట్టు తెలుస్తోంది. కానీ, ఎంత వరకు ఈ ప్రోడక్ట్ సక్సెస్ సాధిస్తుంది.. నిజంగానే అన్ని సమస్యలకు ఇది చెక్ పెట్టనుందా? అనే ప్రశ్నలకు స్వల్పకాలంలోనే సమాధానం తెలియనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ యూట్యూబర్లు, టిక్ టాక్ స్టార్లు కొనుగోలు చేసిన ‘ఇ-ఇల్లు’ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెరుగుతున్న అద్దెలకు ప్రత్యామ్నాయంగా చాలామంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఇటువంటి చిన్న గృహాలను కొనుగోలు చేస్తున్నారు.

ఈ ఇంటిపై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్‌లో ఈ ఇంటిని సమీక్షించిన ఒక వ్యక్తి ఇలా స్పందించాడు. ‘ఇట్స్ లవ్లీ! ఇది సరసమైనది. ఈ ఇల్లు  నాకు, నా కుక్కకు సరిపోతుంది’ అంటూ కామెంట్ చేశాడు. అయితే.., మరికొంత మంది వాదన వేరేలా ఉంది. ‘ఈ ఇల్లు అన్ని విధాలా అంత గొప్పగా లేదు. ఇలాంటి ఇంటిని కొనుగోలు చేయడం అంటే.. డబ్బుని, కాలాన్ని వృథా చేసుకోవడమే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి ఈ ఇల్లు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. భారత మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారనేది  తెలియాల్సి ఉంది. అమెజాన్ తీసుకొచ్చిన ‘ఇ-ఇల్లు’ కాన్సెప్ట్ కరెక్టేనా? మధ్యతరగతి వారికి ఇది వరంగా మారనుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి