iDreamPost

రాజధాని రైతు హఠాన్మరణం

రాజధాని రైతు హఠాన్మరణం

రాష్ట్ర రాజధాని మరియు అభివృద్ధిపై బిసిజి కమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో, బిసిజి కమిటీ రిపోర్ట్ కి వ్యతిరేకంగా అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళన తీవ్రతరమవడంతో రాజధాని పరిధిలోని అనేక ప్రాంతాలలో పోలీసులు మరియు రైతుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఇదిలావుండగా నిన్న మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా ఈ రోజున రాజదాని పరిధిలోని రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

అయితే 18 రోజులుగా రాజధాని కోసం జరుగుతున్న ఆందోళనలలో చురుగ్గా పాల్గొంటున్న కొమ్మినేని మల్లిఖార్జున రావు అనే రైతు హఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన స్వగ్రామం అమరావతి పరిధి లోని దొండపాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా రాజధానిపై జరుగుతున్నా ఆందోళనల్లో ఆయన చాలా చురుగ్గా పాల్గొంటున్నాడని, అయితే నిన్న సాయంత్రం బిసిజి కమిటీ నివేదిక చుసిన తర్వాత, రాజధాని ఇక ఇక్కడ కొనసాగబోదని అర్ధమవడంతో కి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై తన కుమారులతో, తోటి గ్రామస్థుల ముందు తన భాదని వ్యక్తం చేశాడని, రాజధానికి తన భూమిని కూడా లాండ్ పూలింగ్ కి ఇవ్వడంతో ఇప్పుడు తన పరిస్థితి ఏమిటనే మనో వేదనతో తీవ్ర మానసిక ఒత్తిడితో గుండెపోటు కి గురై ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

రాజధాని ఉద్యమ జేఏసీ తో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని రైతు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి తమ ప్రఘాడ సానుభూతిని తెలియజేశారు. ఇదిలా ఉంటే కొందరు స్థానికుల చెబుతున్నదాన్ని బట్టి కొమ్మినేని మల్లిఖార్జున రావు గతంలో రాజధానిలో తనకున్న 1.2 ఎకరాలను రూ. 1.8 ఓట్లకు విక్రయించారని, ఆ డబ్బుతో పిడుగురాళ్ల సమీపంలోని వీరాయపాలెంలో 10 ఎకరాలు, వడ్లమన్నులో నాలుగు ఎకరాలు కొనుగోలు చేశారని అంటున్నారు.అయితే దీనిగురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి