iDreamPost

అమరావతిలో ఇళ్ల పండుగ.. లక్షాధికారులగా మారనున్న పేదలు!

  • Published Jul 24, 2023 | 9:37 AMUpdated Jul 24, 2023 | 9:37 AM
  • Published Jul 24, 2023 | 9:37 AMUpdated Jul 24, 2023 | 9:37 AM
అమరావతిలో ఇళ్ల పండుగ.. లక్షాధికారులగా మారనున్న పేదలు!

పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా జనాలందరికి ఉండే ఏకైక కోరిక.. తాను చనిపోయేలోపు సొంత ఇల్లు కట్టుకోవాలని. ప్రతి మనిషి తాను చనిపోయేలోపు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటాడు. అయితే నేటి కాలంలో ఇంటి నిర్మాణం ఎంత కష్టంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టి ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే చాలా రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అంత వేగంగా సాగడం లేదు. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సంక్షేమ పథకాల అమలు శరవేగంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలందరికి ఉచితంగా ఇంటి స్థలాలు పంచడమే కాక.. ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించి.. పేదవారి సొంతింటి కల సాకారం చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ క్రమంలో తాజాగా అమరావతిలో ఇళ్ల పండుగకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్‌. ఆ వివరాలు..

మంగళగిరి, మండలంలోని కృష్ణాయపాలెం జగనన్న లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలకు శంఖుస్థాపన చేయనున్నారు సీఎం జగన్‌. సోమవారం అట్టహాసంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభం కానుంది. గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలతోపాటు మంగళగిరి నియోజకవర్గం పెదకాకాని మండలంలోని మొత్తం సుమారు 53 వేల మంది పేదలకు.. గతంలోనే సీఎం జగన్‌ సర్కార్‌ ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇళ్ల పట్టాలు పొందిన పేదల కోసం సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం కృష్ణాయపాలెంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం జగన్‌ నిర్ణయంతో అమరావతిలో ఇళ్ల పండుగ మొదలు కానుంది. ఇక్కడ 53 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయితే కొత్తగా 25 ఊళ్లు ఆవిర్భవించనున్నాయి. దాదాపు 2.50 లక్షల మంది జనాభాకు ఈ 53 వేల ఇళ్లు ఆవాసం కానున్నాయి.

ఈ ఇళ్ల నిర్మాణం కోసం జగన్‌ సర్కార్‌ ఏకంగా రూ.1,829.57 కోట్లు వెచ్చించనుంది. ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో వేల కోట్ల రూపాయల వ్యయంతో అన్ని మౌలిక వసతులతో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇక, ఆయా లేఅవుట్‌లలో రూ.384.42 కోట్లతో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించనుంది. ఇక, ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయితే.. అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటుతో కలిపి ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ.10-రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతున్నారు సీఎం జగన్‌. ముఖ్యమంత్రి నిర్ణయంతో అమారవతి పేదలు లక్షాధికారులుగా మారనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి