Arjun Suravaram
Arjun Suravaram
శుక్రవారం డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా నాలుగో విడత నిధులను విడుదల చేశారు. కోన సీమ పర్యటనలో అక్కడి ప్రజలు సీఎం జగన్ కు బ్రహ్మరథం పట్టారు. కోనసీమ పర్యటనలో ఉన్న సీఎంకు.. అక్కడి ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా ఆయనకు పూలు చల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. కోనసీమ ప్రజలు సీఎం జగన్ పై పూల వర్షం కురిపించారు. ఆయన రాకతో ఆ ప్రాంతమంతా జై జగన్ అంటూ మారుమోగింది. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ.. సీఎం జగన్ ముందుకు సాగారు. పచ్చని సీమ సీఎంపై చెప్పలేని ప్రేమను కురిపించింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. శుక్రవారం అమాలాపురంలో పర్యటించారు. అమలాపురం పోలీస్ గ్రౌండ్స్ నుంచి సభ స్థలికి ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఉన్నా కూడా చేరుకోవాడనికి అరగంటకు పైగా సమయం పట్టింది. అడుగడుగునా జై జగన్ అంటూ ప్రజలు నినాదాలు చేస్తుండగా.. వారందరికీ సీఎం వైఎస్ జగన్ అభివాదం చేస్తూ..ముందుకు సాగారు. సభ ప్రాంగణం బయట, రోడ్లపైన జనం బారు తీరారు. అమలాపురం, ఎర్రవంతెన-నల్లవంతెన మార్గం తిరునాళ్లను తలపించింది. సీఎంను చూసిన ఆనందంలో అక్కడి మహిళలు అభివాదం చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక యువతులు సైతం సీఎంను చూసి.. కేకలు వేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
ఇక పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లి వెళ్లే సమయంలో హెలిప్యాడ్ వద్ద బాధితులు సీఎం జగన్ ను కలిసి తమ గోడును వెళ్ల బోసుకున్నారు. వివిధ కారణాలతో బాధ పడుతున్న సుమారు 146 మంది విన్నపాలను రెండు గంటల పాటు ఓపిక సీఎం జగన్ ఆలకించారు. తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అంతేకాక వారంతా భోజనం చేయలేదని తెలుసుకుని భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కోనసీమ పర్యటలో సీఎం జగన్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మరి.. సీఎం జగన్ పై కోనసీమ ప్రజలు చూపిన ప్రేమ, ఘన స్వాగతం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: దేశ చరిత్రలో ఇలాంటి పథకం మరెక్కడా లేదు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్!