iDreamPost
android-app
ios-app

ప్రియుడితో అడ్డంగా దొరికిన భార్య.. దారుణానికి పాల్పడ్డ భర్త! ఏం జరిగిందంటే?

ఏపీలో ఘోరం చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో భర్తకు అడ్డంగా దొరికింది. దీంతో కోపంతో ఊగిపోయిన అతడు ఎవరూ ఊహించిన దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?

ఏపీలో ఘోరం చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో భర్తకు అడ్డంగా దొరికింది. దీంతో కోపంతో ఊగిపోయిన అతడు ఎవరూ ఊహించిన దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?

ప్రియుడితో అడ్డంగా దొరికిన భార్య.. దారుణానికి పాల్పడ్డ భర్త! ఏం జరిగిందంటే?

ఈ మధ్యకాలంలో కొందరు దంపతులు కట్టుకున్న వారిని కాదని మరొకరితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇంతే కాకుండా సమయం దొరికినప్పుడల్లా వారితో తిరుగుతూ సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా చాలా చోట్ల వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే, అచ్చం ఇలాగే ఓ మహిళ ఇంట్లో భర్త లేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి తెచ్చుకుంది. ఇదే టైమ్ కి భర్త రావడంతో ప్రియుడితో భార్య అడ్డంగా దొరికిపోయింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ మహిళ భర్త ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎర్రంపేటలో మద్ది దుర్గ ప్రసాద్-ప్రియాంక (30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. భార్య ప్రియాంక వక్రమార్గంలోకి వెళ్లింది. స్థానికంగా ఉండే శ్రీకాంత్ (36) అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అలా చాలా కాలం నుంచి వీరి అక్రమ సంబంధం కొనసాగుతూ వచ్చింది.

ఇకపోతే, శనివారం రాత్రి దుర్గ ప్రసాద్ ఇంట్లో లేని సమయంలో భార్య ప్రియాంక ప్రియుడు శ్రీకాంత్ ను ఇంటికి రప్పించుకుంది. ఇక ఇదే సమయానికి ఆమె భర్త దుర్గ ప్రసాద్ ఇంట్లోకి వచ్చి చూడగా.. భార్య ప్రియుడితో అడ్డంగా దొరికిపోయింది. ఈ సీన్ చూసి ఆమె భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఆ సమయంలో అతడికి ఏం చేయాలో అర్థం కాక ఇనుప రాడ్డుతో భార్య, ఆమె ప్రియుడిపై దాడి చేశాడు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కొందరు స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీకాంత్, ప్రియాంకను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఇద్దరూ మరణించారని నిర్ధారించారు.

ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతా పరిశీలించి ఈ ఘటనపై కేసు నేమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. భార్య తన ప్రియుడితో దొరికిందని ఇద్దరిని హత్య చేసిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alalobetalobetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Giriş