iDreamPost

Tollywood Bandh స్టార్ హీరోల రెమ్యునిరేష‌న్లు త‌గ్గుతున్నాయా? టాలీవుడ్ బంద్ ఎఫెక్ట్

Tollywood Bandh స్టార్ హీరోల రెమ్యునిరేష‌న్లు త‌గ్గుతున్నాయా? టాలీవుడ్ బంద్ ఎఫెక్ట్

సినిమా బ‌డ్జెట్ ను కంట్రోల్ చేయ‌డానికంటూ తెలుగు ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆగ‌స్ట్1 నుంచి సినిమా షూటింగ్ బంద్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్పుడు దాన్ని అమ‌లు చేసే ప‌నిలో ప‌డ్డారు. పెద్ద సినిమాలు కొన్ని షూటింగ్ లో ఉన్నాయి. వాళ్ల‌తో మాట్లాడుతున్నారు గిల్డ్ ప్ర‌తినిధులు.

ఇక‌, స్టార్ హీరోలు కొంత‌వ‌ర‌కు రెమ్యునిరేష‌న్లు త‌గ్గించుకోవ‌డానికి ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం. సినిమా బ‌డ్జెట్ ను కంట్రోల్ చేయాలంటే రెమ్యునిరేష‌న్లు త‌గ్గాలి. ఆ త‌ర్వాత ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ లోనూ కొత పెట్టాలి. అందుకే జూనియ‌ర్ ఎన్టీయార్, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్ ల‌తో నిర్మాత దిల్ రాజు చ‌ర్చించారు. ఈ ముగ్గురు పాన్ ఇండియ‌న్ హీరోలు, త‌మ రెమ్యునిరేష‌న్ ను త‌గ్గించుకోవడానికి సిద్ధ‌మ‌ని చెప్పారన్న‌ది సినిమా వ‌ర్గాల మాట‌.

స్టార్ హీరోలు ఒప్పుకున్నారు కాబ‌ట్టి మీడియం రేంజ్ హీరోలుకూడా ఆమేర‌కు రెమ్యునిరేష‌న్ త‌గ్గించుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతారు. ఇక మీద‌ట ప్రొడ‌క్షన్ కాస్ట్ ను ఎలా త‌గ్గించుకోవాలో ఆలోచిస్తారు.

నిర్మాత‌లను ఎక్కువ‌గా క‌ల‌వ‌ర‌పెడుతున్న అంశం ఓటీటీ. పెద్ద సినిమాల‌ను 10 వారాల త‌ర్వాత‌, చిన్న సినిమాల‌ను 4 వారాల త‌ర్వాత మాత్ర‌మే ఓటీటీలో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ నిర్ణ‌యం. బాలీవుడ్ లో 54 రోజుల త‌ర్వాత‌నే ఓటీటీలో రిలీజ్ చేస్తారు.

ఒక‌సారి షూటింగ్స్ ఆగిపోయిన త‌ర్వాత, నిర్మాత‌లంద‌రూ క‌ల‌సి కుర్చొని, టెక్నీషియ‌న్లు, కార్మికుల జీతాలు, భ‌త్యాల‌మీదా కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి