iDreamPost

Pushpa 2: ఉత్తరాంధ్రలో ‘పుష్ప 2’ నెక్స్ట్ షెడ్యూల్!

  • Published Mar 05, 2024 | 1:12 PMUpdated Mar 05, 2024 | 1:12 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ కోసం పాన్ ఇండియా లెవల్​లో ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటి ఈ మూవీ షూటింగ్​కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్​ అప్​డేట్ బయటకు వచ్చింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ కోసం పాన్ ఇండియా లెవల్​లో ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటి ఈ మూవీ షూటింగ్​కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్​ అప్​డేట్ బయటకు వచ్చింది.

  • Published Mar 05, 2024 | 1:12 PMUpdated Mar 05, 2024 | 1:12 PM
Pushpa 2: ఉత్తరాంధ్రలో ‘పుష్ప 2’ నెక్స్ట్ షెడ్యూల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్​గా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం ‘పుష్ప 2’. ఈ ఫిల్మ్ కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా మొత్తంగా ఇండియన్ సినిమా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ సభ్యులు ఈ మూవీకి ఇంటర్నేషనల్ రీచ్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, లేటెస్ట్ ఇన్​సైడ్ టాక్ ప్రకారం ‘పుష్ప: ది రూల్’ నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఉత్తరాంధ్రలో జరగనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్​లో శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ‘పుష్ప 2’ నెక్స్ట్ షెడ్యూల్ కోసం వైజాగ్​కు షిఫ్ట్ అవ్వనున్నట్టుగా తెలుస్తోంది. అంటే పుష్పరాజ్ అడుగు ఉత్తరాంధ్రలో పడనుంది అన్నమాట. ఇక, షూటింగ్ స్పాట్ వద్ద అభిమానుల హంగామా భారీ స్థాయిలో ఉంటుంది. అందులోనూ వైజాగ్ అల్లు అర్జున్​కు చాలా స్ట్రాంగ్ ఏరియాగా చెబుతుంటారు ట్రేడ్ పండితులు. ఆగస్టు 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘పుష్ప 2’ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. నిజానికి షూటింగ్​లో పెండింగ్ వర్క్ ఇంకా చాలా ఉందన్న పుకార్లు వినిపిస్తున్నా.. చిత్ర యూనిట్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా ప్రస్తుతం తమ పనిలో నిమగ్నమై ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమా ఇంటర్వెల్ వద్ద వచ్చే జాతర ఎపిసోడ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ రూమర్స్ వచ్చాయి. దర్శకుడు సుకుమార్ మూవీ మొత్తానికే ఆ సీన్స్ హైలైట్​గా నిలిచేలా తెరకెక్కిస్తున్నారని టాక్. ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే జాతర గెటప్​లో అల్లు అర్జున్ లుక్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కాగా, ఆ ఎపిసోడ్​లో విలన్ గ్యాంగ్​తో ఇంటెన్స్ ఫైట్ ఉంటుందని కూడా అంటున్నారు. దాంతో పాటు ఫాహద్ ఫాజిల్-అల్లు అర్జున్ మధ్య వచ్చే ఫైట్​కు బ్యాక్ గ్రౌండ్​లో ఎమోషనల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని కూడా ఒక టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరివన్నీ నిజమా? కాదా? అని తెలియాలంటే ఆగస్ట్ 15 వరకూ ఆగాల్సిందే.

ఇదీ చదవండి: కమల్ థగ్ లైఫ్ నుంచి తప్పుకున్న దుల్కర్ సల్మాన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి