iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ ను దాటేస్తున్న ఐకాన్ స్టార్! ఏ విషయంలో అంటే?

  • Author Soma Sekhar Published - 02:58 PM, Sun - 26 November 23

సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ విషయంలో బీట్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఏ విషయంలో రజినీని బన్నీ బీట్ చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ విషయంలో బీట్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఏ విషయంలో రజినీని బన్నీ బీట్ చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 02:58 PM, Sun - 26 November 23
రజినీకాంత్ ను దాటేస్తున్న ఐకాన్ స్టార్! ఏ విషయంలో అంటే?

టాలీవుడ్.. పాన్ ఇండియా రేంజ్ ను బద్దలు కొడుతూ హాలీవుడ్ వైపు పయనిస్తోంది. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు వస్తేనే గొప్ప అనుకునే స్థాయి నుంచి హాలీవుడ్ మూవీలకు ఏ మాత్రం తీసిపోని చిత్రాలను నిర్మించే స్థాయికి ఎదిగింది. ఇక తెలుగు హీరోలు సైతం వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను సంపాదించుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ విషయంలో బీట్ చేస్తున్నాడట. మరి ఏ విషయంలో రజినీని బన్నీ బీట్ చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరులో ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఈలలు, గోలలు చేస్తారు ఫ్యాన్స్. ఇటీవలే ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా.. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారింది. అదేంటంటే? సూపర్ స్టార్ రజినీకాంత్ అందుకునే రెమ్యూనరేషన్ ను బీట్ చేస్తున్నాడట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఎక్కువ పారితోషికం తీసుకునే స్టార్లలో రజినీ ముందువరుసలో ఉంటారు. ఆయన ఇప్పుడు చేస్తున్న చిత్రానికి రూ. 210 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి గతంలోనే వార్తలు కోడైకూశాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకునే పారితోషికం రజినీ కంటే ఎక్కువ ఉంటుందని టాక్. అయితే బన్నీ తన రెమ్యూనరేషన్ ని పుష్ప 2కి వచ్చే రెవెన్యూలో పర్సెంటేజ్ లాగా తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఈ మూవీకి జరిగే బిజినెస్ లో 33 శాతం బన్నీకి ఇచ్చేలా అగ్రిమెంట్ అయ్యిందని సమాచారం. అంటే? పుష్ప 2కి థియేటర్, ఓటీటీ, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్, ఆడియో అన్ని కలుపుకుని మెుత్తం వెయ్యి కోట్లు వచ్చాయి అనుకుంటే.. అందులో రూ.330 కోట్లు ఐకాన్ స్టార్ కు అందుతాయన్నమాట. దీంతో పారితోషికంలో సూపర్ స్టార్ ను బీట్ చేయనున్నాడు బన్నీ. కాగా.. గతంలో సినిమాలకు హీరోలు కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకునే వారు. కానీ ప్రస్తుతం పెద్ద పెద్ద హీరోలు ఇలా పర్సెంటేజ్ ల రూపంలో తీసుకుంటున్నారు. మరి రజినీని బీట్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş