iDreamPost

Trivikram: విడిపోయిన కుటుంబం, చక్కదిద్దే హీరో కాన్సెప్ట్​కు త్రివిక్రమ్ గుడ్ బై!

  • Published Feb 13, 2024 | 12:15 PMUpdated Feb 13, 2024 | 12:15 PM

‘గుంటూరు కారం’ సినిమాతో సంక్రాంతికి సందడి చేశారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన నుంచి నెక్స్ట్ ఎలాంటి మూవీ వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు.

‘గుంటూరు కారం’ సినిమాతో సంక్రాంతికి సందడి చేశారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన నుంచి నెక్స్ట్ ఎలాంటి మూవీ వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు.

  • Published Feb 13, 2024 | 12:15 PMUpdated Feb 13, 2024 | 12:15 PM
Trivikram: విడిపోయిన కుటుంబం, చక్కదిద్దే హీరో కాన్సెప్ట్​కు త్రివిక్రమ్ గుడ్ బై!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్​లో త్రివిక్రమ్ ఒకరు. ఆయన నుంచి మూవీ వస్తోందంటే చాలు.. హీరోల అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు, మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కథ, కథనాల్లో అంతగా కొత్తదనం లేకపోయినా తన మార్క్ పంచ్ డైలాగ్స్, అదిరిపోయే టేకింగ్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్​లు, హీరోయిజం ఎలివేషన్ సీన్స్​తో మెస్మరైజ్ చేస్తారు. ఈ కోవలో ఆయన నుంచి వచ్చిన చాలా చిత్రాలు బ్లాక్​బస్టర్​ హిట్​లుగా నిలిచాయి. అందుకే త్రివిక్రమ్ మూవీని చూసేందుకు టాక్​తో సంబంధం లేకుండా ప్రేక్షకులు క్యూ కడుతుంటారు. త్రివిక్రమ్ తమను పక్కాగా ఎంటర్​టైన్ చేస్తారని ఆడియెన్స్ నమ్ముతారు. ఆయన కూడా వారిని పెద్దగా నిరాశపర్చలేదు. అయితే ఈ స్టార్ డైరెక్టర్ రెగ్యులర్ కాన్సెప్ట్ నుంచి బయటపడనున్నారని తెలుస్తోంది. అందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​తో చేయబోయే పాన్ ఇండియా ఫిల్మ్​ వేదిక కానుందని టాక్.

అల్లు అర్జున్​తో పాన్ ఇండియా రేంజ్​లో భారీ మూవీని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారనేది తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ లేదు. కానీ ఈ సినిమాతో గురూజీ కొత్త ప్రయోగం చేయనున్నట్లు తెలుస్తోంది. తాను ఇన్నాళ్లూ తీస్తూ వచ్చిన రెగ్యులర్ కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి.. బన్నీ ఫిల్మ్​ను పవర్​ఫుల్​ కాన్సెప్ట్​తో తీసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్​నగర్ టాక్. మామూలుగా త్రివిక్రమ్ సినిమాల్లో విడిపోయిన కుటుంబం, చక్కదిద్దే కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కోవలో ‘అత్తారింటికి దారేది’, ‘అఆ’, ‘అల వైకుంఠపురంలో’ సహా చాలా సినిమాలు వచ్చాయి. దీంతో గురూజీ ఒకే చట్రంలో ఇమిడిపోయారనే విమర్శలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఫార్ములా మూవీస్ నుంచి ఆయన బయటపడనున్నారని వినికిడి.

బన్నీతో తీసే ఫిల్మ్​ను పాన్ ఇండియా రీచ్ ఉండే యూనివర్సల్ కాన్సెప్ట్​తో అత్యంత భారీ బడ్జెట్​తో తీసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్​ వర్క్​లో ఆయన బిజీ అయిపోయారని తెలుస్తోంది. అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ తీసుకొచ్చే ఫుల్ స్క్రిప్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. స్క్రిప్ట్ ఓకే అవగానే ‘పుష్ప 2’ను కంప్లీట్ చేసి ఆ మూవీ పనుల్లో భాగమవ్వాలని ఆయన అనుకుంటున్నారని టాలీవుడ్ సర్కిల్స్​లో వినిపిస్తోంది. ఇదే నిజమైతే త్రివిక్రమ్ పెన్ నుంచి సరికొత్త మ్యాజికల్ స్టోరీ రావడం ఖాయమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. గురూజీకి ఉన్న తెలివి, మేధాశక్తి, నాలెడ్జ్ నుంచి అద్భుతమైన కథ పుట్టడం గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, ఈ ఏడాది సంక్రాంతి పండక్కి ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు త్రివిక్రమ్. సూపర్​స్టార్ మహేష్ బాబు-శ్రీలీల వేసిన డాన్సులు, థమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమాలో హైలైట్​గా నిలిచాయి. మహేష్ ఫుల్ ఈజ్​తో యాక్ట్ చేయడంతో చాలా చోట్ల డివైడ్ టాక్​ వచ్చినా ఈ మూవీ గట్టెక్కింది. అయితే ఇందులో త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ మిస్సయిందని చాలా మంది ఆడియెన్స్ అభిప్రాయపడ్డారు. ఆయన సినిమాల్లో ఒక స్పెషాలిటీ ఉంటుందని.. ఏదో మంత్రం వేసినట్లు సీట్లలో కూర్చోబెడతారని.. కానీ ‘గుంటూరు కారం’లో అది లోపించిందనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో బన్నీతో మూవీని అందరికీ రీచ్ అయ్యేలా పవర్​ఫుల్ కాన్సెప్టుతో త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారనే వార్త వైరల్ అవుతోంది. దీనిపై మూవీ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని అంటున్నారు. మరి.. త్రివిక్రమ్ రెగ్యులర్ రూటు వీడి సరికొత్త దారిలో ప్రయాణించనున్నాడనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: అనుష్క- క్రిష్ మూవీ స్టోరీ లీక్స్.. యధార్థ ఘటనల ఆధారంగా..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి