iDreamPost

MI vs RCB మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? ఆఖరికి టాస్ కూడా నిజం కాదా?

Is MI Rigged The Toss: ముంబయి ఇండియన్స్ జట్టు యాజమాన్యంపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ముంబయి జట్టు టాస్ రిగ్గింగ్ చేసిందంటూ ఆరోపిస్తున్నారు.

Is MI Rigged The Toss: ముంబయి ఇండియన్స్ జట్టు యాజమాన్యంపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ముంబయి జట్టు టాస్ రిగ్గింగ్ చేసిందంటూ ఆరోపిస్తున్నారు.

MI vs RCB మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? ఆఖరికి టాస్ కూడా నిజం కాదా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే ఆడిన 6 మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో ఓటమి పాలయ్యారు. జట్టు నిండా స్టార్స్ ఉన్నా మ్యాచ్ మాత్రం గెలవలేకపోతున్నారు. అయితే వీళ్ల పరాజయానికి చాలానే కారణాలు ఉన్నాయి. కానీ, గురువారం ముంబయితో జరిగిన మ్యాచ్ లో గెలవాల్సిన మ్యాచ్ ని కావాలనే ఓడించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆర్సీబీ విషయంలో చాలా కుట్రలు జరిగాయని.. అన్ని రకాలుగా ఆర్సీబీ జట్టును మోసం చేసి ముంబయి విజయం సాధించింది అంటూ నెట్టింట దుమారం లేచింది. ముఖ్యంగా టాస్ విషయంలో కూడా ముంబయి జట్టు మోసం చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో టాస్ దగ్గరి నుంచే ముంబయి ఇండియన్స్ జట్టు కుట్రలు మొదలయ్యాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ముంబయి జట్టు టాస్ ఓడిపోతే గెలిచినట్లు చూపించారంటూ విమర్శలు చేస్తున్నారు. టాస్ కి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది. కానీ, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో మాయమైపోయింది. కాయిన్ గాల్లోకి ఎగరేసిన తర్వాత డుప్లెసిస్ టెయిల్ కోరుకున్నాడు. అయితే రిఫరీ వెళ్లి కాయిన్ తీసుకుని హార్దిక్ పాండ్యా గెలిచినట్లు ప్రకటిస్తాడు. హార్దిక్ పాండ్యా మేము బౌలింగ్ చేస్తామంటూ చెప్తాడు. కానీ ఆ వీడియో సరిగ్గా గమనిస్తే రిఫరీ కాయిన్ ఫ్లిప్ చేసినట్లు కనిపిస్తోంది అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిస్తే.. ముంబయి ఇండియన్స్ జట్టుకు ఫేవర్ చేసేందుకే రిఫరీ టాస్ ముంబయి గెలిచిందంటూ చెప్పారని విమర్శలు చేస్తున్నారు. కింద పడిన కాయిన్ ని పైకి తీస్తూ దానిని తిప్పి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి ప్రతి మ్యాచ్ కి టాస్ ని కూడా లైవ్ లో స్పష్టంగా చూపించాలని డిమాండ్స్ చేస్తున్నారు. ఈ టాస్ ఒక్కటే కాకుండా ఇంకా అంపైర్స్ చేసిన మోసాలు చాలానే ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. దినేశ్ కార్తీక్ కి వేసిన బంతిని నో బాల్ అయినా.. నో బాల్ ఇవ్వలేదంటున్నారు. ముంబయి బ్యాటర్ కి వేసిన ఫెయిర్ డెలివిరీని వైడ్ గా ప్రకటించారని. వీడియోలో క్లియర్ గా కనిపిస్తున్నా ఆర్సీబీకి బౌండరీ ఇవ్వలేదంటున్నారు. విజయ్ కుమార్ వైషక్ ని కావాలనే అంపైర్స్ కాల్ గా ఇచ్చి అవుట్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ముంబయి జట్టు తమకు ఉన్న రివ్యూలు అయిపోయాక కూడా రివ్యూ తీసుకున్న విషయాన్ని కోట్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాలు చూస్తుంటే ముంబయి ఇండియన్స్ జట్టు మ్యాచ్ కి ముందే విజయం తమేదనని ఫిక్స్ చేసుకున్నారంటూ చెప్తున్నారు. ఈ మ్యాచ్ లో ముంబయి ఫిక్సింగ్ చేసిందటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ ఊదాహరణలు చూసిన తర్వాత ముంబయి మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడింది అంటూ నెటిజన్స్ నుంచి కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే టాస్ విషయంలో మాత్రం ఎలాంటి తప్పు జరిగినట్లు అనిపించడం లేదు. రిఫరీ కాయిన్ ని తీసుకున్న విధానం చూసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఈ ఆరోపణల మీద ముంబయి యాజమాన్యం స్పందిస్తుందేమో చూడాలి. ముంబయి జట్టు టాస్ మార్చేసిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి