iDreamPost

నటి జయప్రదకు హైకోర్టులో ఎదురు దెబ్బ.. ఆ లోగా అరెస్ట్‌ చేయాలంటూ ఆదేశాలు

  • Published Mar 01, 2024 | 9:05 AMUpdated Mar 01, 2024 | 9:05 AM

సినీ నటి జయపద్ర తరుచు ఏదో ఒక సమస్య వెంటడుతునే ఉంది. ఇటీవలే తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంటును నిలిపివేయాలని కోర్టును కోరుతూ జయప్రద దాఖలు చేసింది. కానీ ఊహించని స్థాయిలో కోర్టు ఆమెకు బిగ్ షాక్ ను ఇచ్చింది.

సినీ నటి జయపద్ర తరుచు ఏదో ఒక సమస్య వెంటడుతునే ఉంది. ఇటీవలే తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంటును నిలిపివేయాలని కోర్టును కోరుతూ జయప్రద దాఖలు చేసింది. కానీ ఊహించని స్థాయిలో కోర్టు ఆమెకు బిగ్ షాక్ ను ఇచ్చింది.

  • Published Mar 01, 2024 | 9:05 AMUpdated Mar 01, 2024 | 9:05 AM
నటి జయప్రదకు హైకోర్టులో ఎదురు దెబ్బ.. ఆ లోగా అరెస్ట్‌ చేయాలంటూ ఆదేశాలు

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద తరుచు ఏదో ఒక చిక్కుల్లో పడుతునే ఉంది. గతంలో కార్మికుల ఈఎస్ఐకి సంబంధించిన కేసులో ఆమెకు జైలు శిక్ష పడగా.. మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా, రాజకీయ నాయకురాలుగా మారిన నటి జయప్రద 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమె పై రాంపూర్‌లో రెండు కేసులు నమోదైయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ కేసుల‌ను రాంపూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు లో నడుస్తున్నాయి. దీనిపై కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించ లేదు. దీంతో ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ అయింది. ఇప్పటివరకు ఏడు సార్లు కోర్టు వారెంట్ జారీ చేసింది. అయిన ఆమె కోర్టుకు హాజరు కాలేదు. దీంతో నటి జయప్రదను వెంటనే అరెస్టు చేయమని పోలీసు  సూపరింటెండెంట్‌ లకు చాలాసార్లు లేఖ రాశారు. అయిన ఆమెను అరెస్టు చేయలేదని కోర్టు పోలీసులపై సీరియస్ అయింది.వెంటనే ఆమెను ఈనెల 6వ తేది లోపు అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది.అయితే తనపై జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంటును నిలిపివేయాలని కోర్టును కోరుతూ జయప్రద ఇటీవలే దాఖలు చేసింది. కానీ ఊహించని స్థాయిలో కోర్టు ఆమెకు బిగ్ షాక్ ను ఇచ్చింది.

ఇటీవలే సినీ నటి జయప్రద తనపై కోర్టు జారీ చేసిన నాన్ నాన్ బెయిలబుల్ వారెంటును నిలిపివేయాలని కోరుతూ జయప్రద తాజాగా దాఖలు చేసింది. అయితే జయప్రద చేసిన దాఖలను గురువారం అలహాబాద్ హైకోర్టు తాజాగా కొట్టివేసింది.దీంతో ఊహించని స్థాయిలో ఆమెకు మరో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.కాగా, జయప్రదకు 2019 నుంచి కోర్టు విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా ఆమె హాజరు కాలేదు.దీంతో ఆెను పరారీలో ఉన్న వ్యక్తిగా గతంలో కోర్టు ప్రకటించింది. అలాగే ఆమె పై నాన్ బెయిలబుల్ వారెంటును కోర్టు జారీ చేసింది. ఈ వారెంటును సవాలు చేస్తూ ధాఖలైన పిటిషన్ ను ధర్మాసనం తాజాగా విచారించి కొట్టివేసింది. ఈ క్రమంలోనే జయప్రద తరుపు న్యాయవాది.. త్వరలోనే మేము మరిన్ని వాస్తవాలతో పిటిషన్ దాఖలు చేస్తామని కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు.

ఇక 2019 లోక్ సభ ఎన్నికల్లో జయప్రద రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పెలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్ లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్ లోనే ఉంది. అయితే వ్యక్తితగంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించిన ఆమె రాకపోవడంతో జయప్రదకు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మరి, సినీ నటి జయప్రద పిటిషన్ కోర్టు కొట్టివేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి