iDreamPost

IPL 2024: 8 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లోకి.. అతని కోసం టీమ్స్ పోటా పోటీ!

ఐపీఎల్ 2024 కోసం ఇప్పటి నుంచే అంచనాలు, ఊహాగానాలు పెరిగిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి మినీ వేలం మీదే ఉంది. ఈ వేలంలో ఏ ప్లేయర్ ఎంతకు అమ్ముడవుతాడు? ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది? అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఐపీఎల్ 2024 కోసం ఇప్పటి నుంచే అంచనాలు, ఊహాగానాలు పెరిగిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి మినీ వేలం మీదే ఉంది. ఈ వేలంలో ఏ ప్లేయర్ ఎంతకు అమ్ముడవుతాడు? ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది? అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

IPL 2024: 8 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లోకి.. అతని కోసం టీమ్స్ పోటా పోటీ!

పొట్టి క్రికెట్ సంబరం ఇప్పటికే మొదలైపోయింది. ఇప్పటి నుంచే ఐపీఎల్ 2024 ఎలా ఉండబోతోంది అంటూ ఫ్యాన్స్ అంచనాలు వేయడం ప్రారంభించారు. తమ అభిమాన ప్లేయర్స్ ఏ జట్టులో ఉంటారు? తాము అభిమానించే జట్టు ఎలా ప్రదర్శన చేస్తుంది? ఈసారి కప్పు మాదే అంటూ ఇప్పటి నుంచే నెట్టింట చర్చలు, రచ్చలు మొదలు పెట్టేశారు. నవంబర్ 30తో ఐపీఎల్ వేలం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. డిసెంబర్ 19న ఐపీఎల్ మినీ వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ వేలంలో ఏ ప్లేయర్ ఎంత ధర పలుకుతాడు? ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంటుందనే సందేహాలు ఉండనే ఉంటాయి. ఈసారి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఒక ప్లేయర్ విషయంలో ఫ్రాంచైజీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే అతను దాదాపు 8 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో పాల్గొనబోతున్నాడు.

ఐపీఎల్లో పాల్గొనాలంటే ముందు ఐపీఎల్ వేలం కోసం ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతేకాకుండా వారి వారి బోర్డుల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ప్లేయర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నవంబర్ 30తో ముగుస్తుంది. ఆ తర్వాత మినీ వేలం కోసం రంగం సిద్ధమవుతుంది. ఈసారి వేలానికి సంబధించి చాలానే ఆసక్తికర అంశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది.. 8 ఏళ్ల తర్వాత ఒక స్టార్ ప్లేయర్ తిరిగి ఐపీఎల్ ఆడబోతున్నాడు. అతను మరెవరో కాదు.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్. అతని ఆఖరి ఐపీఎల్ ని 2015లో ఆడాడు. ఇతను ఇప్పటి వరకు కేవలం రెండంటే రెండు సీజన్స్ లో మాత్రమే ఆడాడు.

రెండు సీజన్స్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున స్టార్క్ బరిలోకి దిగాడు. ఆ తర్వాత 2018లో కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ, గాయం కారణంగా స్టార్క్ ఆ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ తిరిగి ఐపీఎల్ కి మిచెల్ స్టార్క్ రాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత స్టార్క్ తిరిగి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇన్నాళ్లు ఆస్ట్రేలియా జట్టు కోసం ఈ పొట్టి సమరానికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఐపీఎల్ కి తిరిగి రావడానికి ప్రధాన కారణం ఆస్ట్రేలియా జట్టు కోసమే. రాబోయే టీ20 వరల్డ్ కప్ కి ఇది మంచి ప్రాక్టీస్ అవుతుందని భావించిన స్టార్క్.. ఈసారి సీజన్ ఆడేందుకు రెడీ అయ్యాడు.

అయితే తనను ఎవరైనా తీసుకుంటారా? అనుమానం కూడా తనలో ఉందనే విషయాన్ని వెల్లిబుచ్చాడు. కానీ, నిజానికి స్టార్క్ కోసం ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. అతని కోసం 5 ఫ్రాంచైజీలు ఇప్పటికే సంప్రదింపులు జరిపాయంటూ వార్తలు వస్తున్నాయ. వేలంలో కచ్చితంగా మిచెల్ స్టార్క్ కు డిమాండ్ ఉంటుందనే చెప్పాలి. అతని కోసం ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్, పంజాబ్, ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయంట. అతను వేలంలోకి గనుక అడుగుపెడితే కచ్చితంగా ఈ టీమ్స్ మధ్యలో పోటీ నెలకొంటుంది. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ భారీ ధరకు అమ్ముడైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి.. స్టార్క్ ఇన్నేళ్ల తర్వాత ఐపీఎల్ లోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి