iDreamPost

హైకోర్టు వద్దా అఖిల??

హైకోర్టు వద్దా అఖిల??

రాజధానిపై జియన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో ఆ కమిటీకి వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు తమ ప్రాంత ప్రజలు మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి స్పందిస్తున్నారు. అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తూ టీడీపీ పార్టీ నాయకులందరినీ కూడా అదే డిమాండ్ చెయ్యమని కట్టడి చేస్తున్నాడు కానీ కొందరు నాయకులు వారి ప్రాంత అభిప్రాయాలకు అనుగుణంగా స్పందిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రాయలసీమ కు చెందిన కే.యీ కృష్ణమూర్తి సోదరులతో మరికొందరు తెలుగుదేశం నేతలు కర్నూలులో హైకోర్టు రావడాన్నీ స్వాగతిస్తున్న తరుణంలో రాయలసీమ మేధావులు కూడా శ్రీభాగ్ ఒడంబడిక అంశాన్ని ప్రస్తావిస్తూ కర్నూల్ లో హైకోర్టు ని స్వాగతించారు. మరో వైపు ఉత్తరాంధ్రా కి చెందిన సీనియర్ తెలుగుదేశం లీడర్లు గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి లాంటివాళ్లు విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా చేయడాన్ని స్వాగతిస్తున్నామని, జగన్ నిర్ణయానికి బహిరంగంగా మద్దతు తెలపడంతో సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్న తరుణంలో ప్రజల్లో తన వాదన ఎక్కడ పల్చనౌతుందోనని భావించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకి బాగా దగ్గరగా వుండే ఉత్తరాంధ్రాకి చెందిన యనమల, కళా వెంకటరావు, కునా రవికుమార్ లాంటివాళ్ల చేత తన అనుకూల మీడియాలో 3 రాజధానులకి వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించడం ద్వారా తన వాదనని కొంతమేరా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాయలసీమ లో మాత్రం పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది.

రాయలసీయ లో మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఫరూఖ్,సి జనార్దన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి,బీవీ నాగేశ్వర రెడ్డి లాంటి పలువురు సీనియర్ తెలుగుదేశం నేతలు కూడా తమ ప్రాంత వాసుల అభిప్రాయాల్ని మనోభావాల్ని దృష్టిలో ఉంచుకొని అమరావతి.. 3 రాజధానులు.. హైకోర్టు.. అంశలలో అధినేతని సమర్ధించడానికి మొహం చాటేశారు. ఈ తరుణం లో చివరికి ఇప్పుడు చంద్రబాబుకి ఒక్క భూమా అఖిలప్రియా మాత్రమే దిక్కు అయ్యారు.

భూమా అఖిలప్రియా మాత్రం రాయలసీమ ప్రజల అభిప్రాయాలని, సెంటిమెంట్ కి విరుద్ధంగా తన రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి రోజు మీడియా ముందుకు వస్తున్నారు. కర్నూలులో హైకోర్టుతో పాటు పలు ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేయమని సిపార్సు చేసిన జియన్ రావు కమిటీ నివేదికని స్వాగతించాల్సింది పోయి.. ఇంకో అడుగు ముందుకేసి అమరావతి లోనే రాజధానిని కొనసాగించాలని, కర్నూల్ లో హైకోర్టు రావడం వల్ల రాయలసీమ ప్రాంత వాసులకి పెద్దగా ఒనగూరే ప్రయోజనం ఏమి లేదని, ప్రభుత్వం హైకోర్టు ని కర్నూల్ లో ఏర్పాటు చెయ్యదానికి నిధులు ఎక్కడనుండి తీసుకొస్తారని ప్రశ్నించడం పట్ల కర్నూల్ జిల్లాతో పాటు మొత్తం రాయలసీమ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అఖిల ప్రియా ఈ మధ్య కాలంలో కేవలం తన వ్యక్తిగత కారణాల వల్లే జగన్ ప్రభుత్వనికి వ్యతిరేకంకంగా వ్యవహిస్తున్నారని అర్ధం అవుతుంది. ఆమె భర్త పై పలు ఆరోపణలు రావడం, తన భర్తపై ఈ ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులు పెడుతుందని ఆరోపించడం వంటి కారణాలతో తనకి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించిన చంద్రబాబు కి బాగ దగ్గరదగ్గరైనట్టు తెలుస్తుంది. చంద్రబాబుకి కూడా జిల్లాలో ఈ కష్టకాలంలో మద్దతు ఇచ్చే ఇతర నేతలు ఎవరు ముందుకి రాకపోవడంతో తన ప్రయోజాకోసం అఖిల ప్రియని రాజకీయంగా ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది.

అఖిలప్రియ అనుభవరాహిత్యంతో వివాదాస్పద వ్యక్తిత్వంతో గతంలో కూడా సీనియర్ నేతలతో పొసగక ఆమె నష్టపోయేది కాక పార్టీని కూడా నష్టపరిచిన ఉదంతాలు చూసాం. ఇప్పుడు కూడా తన ప్రాంత ప్రజలు మనోభావాలకి విరుద్ధంగా ముందుకి వెళితే రాజకీయంగా తీవ్రంగా నష్టపోక తప్పదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి