iDreamPost

OTTలోకి అఖిల్ ఏజెంట్.. రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్

  • Published Apr 10, 2024 | 1:43 PMUpdated Apr 10, 2024 | 1:43 PM

చాలా వరకు థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా.. నెల రోజుల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తూ ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రం నెలలు గడిచిన కూడా ఓటీటీ ఊసే రాదు. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా ఈ కోవకు చెందిందే. అయితే, ఇన్నాళ్లకు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ గురించి బజ్ నడుస్తోంది.

చాలా వరకు థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా.. నెల రోజుల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తూ ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రం నెలలు గడిచిన కూడా ఓటీటీ ఊసే రాదు. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా ఈ కోవకు చెందిందే. అయితే, ఇన్నాళ్లకు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ గురించి బజ్ నడుస్తోంది.

  • Published Apr 10, 2024 | 1:43 PMUpdated Apr 10, 2024 | 1:43 PM
OTTలోకి అఖిల్ ఏజెంట్.. రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్

అఖిల్ అక్కినేని ఈ హీరో తీసినవి కొన్ని సినిమాలే అయినా కూడా.. ఆడియన్స్ లో మాత్రం ఈ హీరో సినిమాకు మంచి నేమ్ ఏ ఉంది. అయితే, అఖిల్ ఆఖరిగా తెరపైన కనిపించిన సినిమా ఏజెంట్. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది కావొస్తుంది. అయినా కూడా ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్న తరుణంలో.. ఏజెంట్ సినిమా ఓటీటీలోకి రాకపోవడం అందరికి ప్రస్నార్ధకంగా మారింది. గతంలో కూడా ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి ఎన్నో చర్చలు జరిగాయి . కానీ, సినిమా మాత్రం ఓటీటీ లోకి రాలేదు. దీనితో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు కనీసం ఓటీటీలో అయినా చూద్దాం అనుకోవడం ఆశగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా ఏజెంట్ సినిమా ఓటీటీపై టాక్ నడుస్తోంది. చూడబోతుంటే త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేలా ఉంది.

ఏజెంట్ మూవీకి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను స్పై యాక్ష‌న్ కథాంశంతో రూపొందించారు. కాగా, ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ 28న థియేటర్ లో రిలీజ్ అయ్యి.. కేవలం ఎనిమిది కోట్ల క‌లెక్ష‌న్స్ తో సరిపెట్టుకుని.. బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగుతో పాటు అటు మలయాళంలోనూ రిలీజ్ చేశారు మేకర్స్. కానీ రెండు భాషలలో కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో అఖిల్ తో పాటు. మ‌ల‌యాళ అగ్ర హీరో మ‌మ్ముట్టి, డినో మారియా ప్రధాన పాత్రలలో పోషించారు. ఇక అఖిల్ కు జోడిగా ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఏజెంట్ సినిమాను సోనీలివ్ కొనుగోలు చేసింది. అయితే అప్పటినుంచి కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు కానీ.. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు మధ్య ఉన్న గొడవల కారణంగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వస్తుంది.

Producer who gave clarity on release of Akhil Agent into OTT

కానీ, రీసెంట్ గా ఏజెంట్ సినిమా ప్రొడ్యూసర్ అనిల్ సుంకరను ట్యాగ్ చేస్తూ వచ్చిన కామెంట్స్ తో ఈ సినిమా ఓటీటీ ఎంట్రీపై ఆశలు పెరిగాయి. అనిల్ సుంకరతో హీరో అఖిల్ అక్కినేనిని ట్యాగ్ చేస్తూ.. ఏజెంట్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయండి అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. దీనితో ఆ కామెంట్ కు అనిల్ స్పందించి.. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీ లివ్‌కు అమ్మామని.. ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయమని ఇప్పటికే చాలా సార్లు చెప్పమని.. త్వ‌ర‌లోనే ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపాడు. దీనితో అఖిల్ అభిమానులకు ఆశలు చిగురించాయి. ఇక ఏజెంట్ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో రిక్కీ అలియాస్ రామ‌కృష్ణ అనే ఏజెంట్ పాత్ర‌లో అఖిల్ అలరించాడు. చైనాతో కలిసి ఇండియాను నాశనం చేసేందుకు.. ఒక వ్యక్తి చేస్తున్న కుట్రలను హీరో ఎలా చెప్పాడు అనేదే ఈ సినిమా కథ. మరి, ఈ సినిమా ఓటీటీ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి