ఆసియా కప్ 2023లో టీమిండియా దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో ఆసియా కప్ ఫైనల్ బెర్త్ ను కన్ఫమ్ చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం చివరి సూపర్-4 మ్యాచ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో తలపడబోతోంది. అయితే ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్ కు ఇండియా వెల్లడంతో.. ఈ మ్యాచ్ కు అంతగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియా భారీగా ప్రయోగాలు చేస్తుందని తెలుస్తోంది. ఈ విషయంపై తాజాగా మాట్లాడాడు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి వార్నింగ్ ఇచ్చాడు. అతడిని పక్కన పెట్టాలని సూచించాడు.
ఆసియా కప్ లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కు సంబంధించి పలు సూచనలు చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీని తప్పించాలని చెప్పుకొచ్చాడు ఈ దిగ్గజ క్రికెటర్. ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..”విరాట్ కోహ్లీని ఈ మ్యాచ్ లో పక్కన పెట్టాలి. ఇక కోహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను ఆడించాలి. అలాగే టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ కు కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే? అతడు వన్డే ప్రపంచ కప్ జట్టులో ఉన్నాడు. అతడికి ఇంకా వన్డే ఫార్మాట్ మీద పట్టురాలేదు. దీంతో అతడికి మరిన్ని అవకాశాలు ఇచ్చి.. వరల్డ్ కప్ నాటికి అతడిని సిద్దం చేయాలి. ఇదే ఇప్పుడు టీమిండియా ముందున్న సమస్య” అంటూ చెప్పుకొచ్చాడు ఆకాశ్ చోప్రా.
సూర్యకుమార్ ఇప్పుడు ఆడకపోతే.. ఆస్ట్రేలియా సిరీస్ లోనైనా ఆడించాలి. లేకపోతే వరల్డ్ కప్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటూ టీమిండియాను హెచ్చరించాడు ఆకాశ్ చోప్రా. సూర్యకుమార్ ను ఆడించకపోతే.. ప్రపంచ కప్ కోసం జట్టు పూర్తిగా రెడీ అయినట్లు కాదు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరి కోహ్లీని పక్కన పెట్టాలి, శ్రేయస్, సూర్యను జట్టులోకి తీసుకోవాలన్న ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.