iDreamPost

టన్నెల్ కార్మికుల ఆరోగ్యంపై ఎయిమ్స్ కీలక అప్డేట్!

UttaraKhand Tunnel: ఉత్తరకాశీలో టన్నెల్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తరువాత అందులో చిక్కుకున్న 41 మంది కార్మికులు మంగళవారం బయటకు వచ్చారు. తాజాగా వారి ఆరోగ్యానికి సంబంధించి ఎయిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేశారు.

UttaraKhand Tunnel: ఉత్తరకాశీలో టన్నెల్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తరువాత అందులో చిక్కుకున్న 41 మంది కార్మికులు మంగళవారం బయటకు వచ్చారు. తాజాగా వారి ఆరోగ్యానికి సంబంధించి ఎయిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేశారు.

టన్నెల్ కార్మికుల ఆరోగ్యంపై ఎయిమ్స్ కీలక అప్డేట్!

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో సొరంగం కుప్పకూలిన ఘటన అందరికి తెలిసిందే. ప్రమాదంలో 41 మంది కార్మికులు చిక్కుకోవడం…17 రోజుల తరువాత బయటకు రావడం జరిగింది. నవంబర్ 12న ఈ ఘటన జరగ్గా..17 రోజుల తరువాత  నవంబర్ 28న బయటకు వచ్చారు. టన్నెల్ నుంచి బయటకు వచ్చిన వారి ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు.. వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే తాజాగా టన్నెల్‌ ‍ప్రమాదం నుంచి బయటపడ్డ ఆ 41 మంది కార్మికులు ఆరోగ్యంపై ఎయిమ్స్‌ డాక్టర్లు కీలక విషయాలు వెల్లడించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరాఖండ్ లో జరిగిన టన్నెల్ ఘటన దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. నవంబర్ 12న  ఉత్తరకాశీలోని సిల్క్యారా అనే ప్రాంతంలో చార్ ధామ్ లో భాగంగా చేపట్టిన టెన్నెల్ ప్రాజెక్ట్ లో ప్రమాదం జరిగింది. 150 మీటర్ల మేర సొరంగం కుప్పకూలింది. అందులో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రెస్క్యూ టీమ్ 17 రోజుల పాటు శ్రమించి కాపాడింది. నవంబర్ 28న టన్నెల్ లోని 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. అయితే చాలా రోజుల పాటు వారు సొరంగంలో ఉండటంతో వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు ఆందోళన చెందారు.

అందుకే కార్మకులు బయటకు రాగానే చికిత్స నిమిత్తం రిషికేశ్ లోని ఎయిమ్స్ కు తరలించారు. 41 మందిలో యూపీ, జార్ఖండ్‌, బీహార్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. రెండు రోజుల పాటు వారిని ఎయిమ్స్ లో ఉంచి.. వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు. తాజాగా కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు కీలక అప్డేట్ ఇచ్చారు. టన్నెల్‌ నుంచి బయటికి వచ్చిన కార్మికులందరికీ ఇళ్లకు వెళ్లేందుకు మెడికల్‌ క్లియరెన్స్‌ ఇచ్చామని, వారంతా వారి రాష్ట్రాల నోడల్‌  అధికారులకు టచ్‌లో ఉంటారని వైద్యులు తెలిపారు. ఈ మేరకు నోడల్‌ అధికారులకు సమాచారమిచ్చామని అసిస్టెంట్‌ ‍ప్రొఫెసర్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్‌ తెలిపారు. ఆ కార్మికులు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇళ్లకు వెళ్లిపోవచ్చని చెప్పారు. తాజాగా వైద్యులు చేసిన ప్రకటనతో కార్మికల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి