iDreamPost

కొత్త టెక్నాలజీతో రూపాయి ఖర్చు లేకుండా సినిమాలు..

  • Published Apr 22, 2024 | 11:35 AMUpdated Apr 22, 2024 | 11:35 AM

ఒకప్పుడు సినిమాలు తీయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని.. కానీ ఇప్పుడు కష్టాన్ని తగ్గించి పని సులభం చేసేలా టెక్నాలజీ మారుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఒక సినిమాలో ఆర్టిఫీషియల్ టెక్నాలజీని ఉపయోగించి తీసిన కొన్ని విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

ఒకప్పుడు సినిమాలు తీయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని.. కానీ ఇప్పుడు కష్టాన్ని తగ్గించి పని సులభం చేసేలా టెక్నాలజీ మారుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఒక సినిమాలో ఆర్టిఫీషియల్ టెక్నాలజీని ఉపయోగించి తీసిన కొన్ని విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

  • Published Apr 22, 2024 | 11:35 AMUpdated Apr 22, 2024 | 11:35 AM
కొత్త టెక్నాలజీతో రూపాయి ఖర్చు లేకుండా సినిమాలు..

సినిమాలు చూడడం అంటే అందరికి ఇష్టమే.. కానీ సినిమాలు తీయడం వెనుక ఉన్న కష్టం మాత్రం ఎవరికీ కనిపించదు. ఒక చిన్న సినిమాను తీసేందుకు దాదాపు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు సమయాన్ని తీసుకుంటారు. ఇంకా అది భారీ బడ్జెట్ సినిమా అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు సమయం తీసుకుంటారు. కానీ ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది కాబట్టి.. సినిమాలు తీసే విధానంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు రాబోయే రోజుల్లో అంతా ఎఐ యుగమే నడుస్తుందని.. వింటూనే ఉన్నాము. ఈ క్రమంలో సినిమాలలో కూడా ఈ ఎఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక సినిమాలో ఆర్టిఫీషియల్ టెక్నాలజీని ఉపయోగించి తీసిన కొన్ని విజువల్స్.. కొన్ని మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

ఆర్టిఫీషియల్ టెక్నలాజిని బయట కంటే కూడా సినిమాలలోనే అధికంగా వాడేస్తున్నారని చెప్పి తీరాలి. ఇప్పటికే తెలుగులో చాలా మంది సంగీత దర్శకులు.. ఈ ఎఐ టెక్నలాజిని ఉపయోగించుకుని.. కొన్ని పాటలను క్రియేట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. టాలీవుడ్ దర్శకులు పాటలతో ఆగిపోతే.. హాలీవుడ్ లో ఏకంగా ఒక సినిమానే తీసేలా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల వచ్చిన “జేమ్స్ బాండ్” 26 వ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఒకటి యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. దానికి కారణం లేకపోలేదు.. ఈ ట్రైలర్ లో కొంత నార్మల్ ఫుటేజ్ తో పాటు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తీసిన విజువల్స్ కూడా ఉన్నాయి.

యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ ట్రైలర్ కు ఇప్పటివరకు త్రి మిలియన్ వ్యూస్ కు పైగానే వచ్చాయి. మొదట ఈ ట్రైలర్ ను చూసి సినిమాపై ఆసక్తి పెంచుకున్న మూవీ లవర్స్.. అందులోని కొన్ని విజువల్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడినవి అని తెలిసి ఆశ్చర్య పోతున్నారు. ఎందుకంటే ప్రతి విజువల్ కూడా ఎంతో పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇక కేవలం ట్రైలర్ లోని కొన్ని విజువల్స్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి.. రానున్న రోజుల్లో ఎఐ తో సినిమా తీసిన ఆశ్చర్యం లేదు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో.. ఎవరికీ వారు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూనే ఉన్నారు. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి అద్భుతలో కనిపిస్తాయో వేచి చూడాలి.  మరి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన ఈ ట్రైలర్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి