iDreamPost
android-app
ios-app

ద్యావుడా ఏంది సామీ.. ట్రైలరే ఇంత బోల్డ్ గా ఉంటే సినిమా వస్తే..?

Mix Up Movie Trailer: తెలుగులో బోల్డ్ కంటెంట్, బోల్డ్ సినిమాలు రావడం చాలా అరుదు. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఒక బోల్డ్ కంటెంట్ సినిమా వస్తోంది. దానికి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది.

Mix Up Movie Trailer: తెలుగులో బోల్డ్ కంటెంట్, బోల్డ్ సినిమాలు రావడం చాలా అరుదు. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఒక బోల్డ్ కంటెంట్ సినిమా వస్తోంది. దానికి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది.

ద్యావుడా ఏంది సామీ.. ట్రైలరే ఇంత బోల్డ్ గా ఉంటే సినిమా వస్తే..?

ఇండస్ట్రీ ఏదైనా బోల్డ్ కంటెంట్ అనేది కామన్ అనే చెప్పాలి. అన్నీ జానర్స్ లాగానే అది కూడా ఒక జానర్. ఓటీటీల్లో కూడా రొమాన్స్ అనే కేటగిరీ ఉంటుంది. ఆ మూవీస్ కావాలి అనుకున్న ప్రేక్షకులు వాటిని వెతుక్కుంటూ వెళ్లి చూస్తారు. అయితే ఓటీటీల్లో అలాంటి కంటెంట్ వేరే భాషలవే ఉంటాయి. కానీ, ఇప్పుడు తెలుగు ఓటీటీలో, తెలుగులో ఒక బోల్డ్ కంటెంట్ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఆ మూవీ టీజర్ యూట్యూబ్ లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ మూవీ ట్రైలర్ వచ్చేసింది. టీజర్ తరహాలోనే ట్రైలర్ కూడా అంతే అరాచకంగా సాగింది.

గత కొన్ని రోజులుగా ఓటీటీలు, సినిమాలకు సంబంధించి మిక్సప్ అనే మూవీ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఈ మూవీ పూర్తి బోల్డ్ కంటెంట్ గా రాబోతోంది. హాలీవుడ్, బాలీవుడ్ లో ఇలాంటి కంటెంట్ కొత్తేం కాదు. కానీ, తెలుగులో మాత్రం ఇలాంటి ఒక బోల్డ్ మూవీ రావడం అరుదు అనే చెప్పాలి. సినిమా మెసేజ్ ఓరింయంటెడ్ అయినా కూడా సీన్స్, టేకింగ్ అంతా బోల్డ్ గా ఉంది. ఈ మిక్సప్ మూవీకి ఆకాశ్ బిక్కీ డైరెక్షన్ చేశాడు. ఆదర్శ్, కమల్, అక్షర గౌడ్, పూజా జే లీడ్ రోల్స్ ప్లే చేశారు. వీళ్లు నలుగురు ఒక మంచి కపుల్స్ పాత్రల్లో మెప్పిస్తారని క్లారిటీ వచ్చేసింది.

ఈ మిక్సప్ మూవీ కథ విషయానికి వస్తే రెండు జంటల్లో ఇద్దరు ఒక తరహా ఆలోచనలు కోరికలు, ఇంకో ఇద్దరి ఆలోచనలు వారికి భిన్నంగా ఉంటాయి. ఒక జంటలో భార్యకు విపరీతమైన సె*క్స్ కోరికలు ఉంటాయి. ఆమె పనులు కూడా అంతే విపరీతంగా, క్రూరంగా ఉంటాయి. కానీ, భర్త మాత్రం ప్రేమ ఎమోషనల్ బాండింగ్ అంటూ ఉంటాడు. ఇంకో జంటలో భర్తకు విపరీతమైన శృంగార కోరికలు ఉంటాయి. భార్య ఇష్టంతో సంబంధం లేకండా సె*క్స్ చేయాలని చూస్తాడు. కానీ, ఆమె మాత్రం ప్రేమ అనేది మనసుకు సంబంధించి అంటూ క్లాసులు పీకుతూ ఉంటుంది. ఇలా రెండు జంటలు భిన్నమైన ఆలోచనలు, కోరికలు, అభిప్రాయాలు కలిగి ఉంటారు. అలాంటి వాళ్లు విడిపోయాలని నిపుణులను కలుస్తారు. వాళ్లు మాత్రం వీరిని కాస్త బ్రేక్ తీసుకుని.. టూర్ కి వెళ్లమంటారు.

అలా కలిసుందామని టూర్ కి వెళ్లిన ఈ కపుల్ ఒకరి జీవితంలోకి ఒకరు ప్రవేశిస్తారు. అలా అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇదే మిక్సప్ కథ. ఇందులో ప్రస్తుతం సమాజానికి సంబంధించి చాలానే పోలికలు ఉన్నాయి. ఇందులో గట్టి మెసేజ్ కూడా ఉండే అవకాశం ఉంది. తుచ్యమైన కోరికల కోసం స్వచ్ఛమైన ప్రేమను, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనే నేపథ్యంలో ఈ సినిమా ఉండేలా కనిపిస్తోంది. ఈ చిత్రం ఆహా ఒరిజినల్ గా మార్చి 15 నుంచి వారి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ టీజర్ వచ్చిన తర్వాత మూవీపై గట్టి అంచనాలు వచ్చాయి. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అవి రెట్టింపు అయ్యాయి. మరి.. మిక్సప్ మూవీ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet