iDreamPost

వీడియో: అల్లు అర్జున్ ని పట్టుకుని సుకుమార్ ఎమోషనల్!

వీడియో: అల్లు అర్జున్ ని పట్టుకుని సుకుమార్ ఎమోషనల్!

సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. పుష్పరాజ్ తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టుకు తీసుకెళ్లాడు. గురువారం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు దక్కించుకున్నాడు. టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి యాక్టర్ గా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు దక్కించుకోవడంతో ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు పుష్ప చిత్ర బృందం మొత్తం అల్లు అర్జున్ నివాసంలో కలుసుకున్నారు. అల్లు అర్జున్ జాతీయ అవార్డు రావడంపై బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ ఎమోషనల్ అయ్యాడు. ఆర్య సినిమా నుంచే సుకుమార్- అల్లు అర్జున్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ తర్వాత ఆర్య 2, పుష్ప సినిమాలతో ఆ బంధం మరింత బలపడింది. ఇప్పుడు అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు దక్కడంతో బన్నీ కంటే కూడా సుకుమార్ ఎక్కువ ఆనందంగా కనిపించాడు. ఒక్కసారిగా వెళ్లి అల్లు అర్జున్ గట్టిగా హగ్ చేసుకుని చాలాసేపు వదిలిపెట్టకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంక పుష్ప సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేసిన రికార్డులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్త్ లో కూడా బన్నీకి ఫ్యాన్ బేస్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ చిత్రాల్లో పుష్ప 2 టాప్ ప్లేస్ లో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి