iDreamPost
android-app
ios-app

UAE vs AFG: వరల్డ్ కప్​లో ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ను ఓడించిన ఆఫ్ఘానిస్థాన్‌కు ఘోర అవమానం!

  • Published Jan 01, 2024 | 1:14 PM Updated Updated Jan 01, 2024 | 1:14 PM

భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్-2023లో ఇంగ్లండ్, పాకిస్థాన్​ లాంటి బిగ్ టీమ్స్​కు షాకిచ్చింది ఆఫ్ఘానిస్థాన్. అలాంటి జట్టుకు తాజాగా ఘోర అవమానం జరిగింది.

భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్-2023లో ఇంగ్లండ్, పాకిస్థాన్​ లాంటి బిగ్ టీమ్స్​కు షాకిచ్చింది ఆఫ్ఘానిస్థాన్. అలాంటి జట్టుకు తాజాగా ఘోర అవమానం జరిగింది.

  • Published Jan 01, 2024 | 1:14 PMUpdated Jan 01, 2024 | 1:14 PM
UAE vs AFG: వరల్డ్ కప్​లో ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ను ఓడించిన ఆఫ్ఘానిస్థాన్‌కు ఘోర అవమానం!

ఆఫ్ఘానిస్థాన్.. నిన్న మొన్నటి వరకు క్రికెట్​లో అందరూ పసికూనగా చూసిన జట్టు. కానీ ఒక్క టోర్నమెంట్​తో అంతా మారిపోయింది. వన్డే వరల్డ్ కప్​-2023లో ఆ టీమ్ తమ సత్తా ఏంటో చాటింది. ఛాంపియన్ టీమ్​ అయిన ఇంగ్లండ్​తో పాటు ప్రమాదకర పాకిస్థాన్​నూ మట్టికరిపించింది ఆఫ్ఘాన్. వీటితో పాటు శ్రీలంకనూ ఓడించి సెమీస్​కు దూసుకెళ్లేలా కనిపించింది. కానీ కీలకమైన మ్యాచ్​లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో అది సాధ్యం కాలేదు. మెగా టోర్నీలో వరుస విజయాలతో అందర్నీ ఆశ్చర్యపర్చింది ఆఫ్ఘాన్. మంచి బ్యాటింగ్ లైనప్, సూపర్బ్ బౌలింగ్​తో అదరగొట్టింది. రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు టీమ్​లో ఉండటం ఆఫ్ఘాన్​కు పెద్ద బలంగా మారింది. రెహ్మానుల్లా గుర్బాజ్​తో పాటు ఇబ్రహీం జాద్రాన్, రహ్మత్ షా లాంటి యంగ్​స్టర్స్ బ్యాటింగ్​లో చెలరేగి ఆడుతూ సంచలన విజయాలు అందించారు. అయితే ఆ టీమ్​కు ఘోర అవమానం జరిగింది. ఆఫ్ఘాన్​ను పసికూన జట్టు యూఏఈ ఓడించింది.

వరల్డ్ కప్​లో ఇంగ్లండ్, పాకిస్థాన్​ లాంటి స్ట్రాంగ్ టీమ్స్​ను ఓడించిన ఆఫ్ఘానిస్థాన్​కు యూఏఈ షాకిచ్చింది. షార్జా వేదికగా ఆదివారం ఆఫ్ఘాన్​తో జరిగిన రెండో టీ20లో యూఏఈ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తంగా ఆఫ్ఘాన్​పై యూఏఈకి ఇది మూడో విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్లు మహ్మద్ వసీం (53), ఆర్యన్ లక్రా (63) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. వీళ్లిద్దరూ తప్పితే మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆఖర్లో అకిఫ్ రాజా రెండు బౌండరీలతో అలరించాడు. ఆఫ్ఘాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయి, ఖాయిస్ అహ్మద్ తలో 2 వికెట్లు తీశారు.

Shame on Afghanistan!

ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘానిస్థాన్​కు మంచి స్టార్ట్ లభించింది. హజ్మతుల్లా జజాయి (36), రెహ్మానుల్లా గుర్బాజ్ (21) మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ ఔట్ అవడం.. ఇబ్రహీం జాద్రాన్ (4), నజీబుల్లా జాద్రాన్ (12) కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్​కు చేరడంతో ఆఫ్ఘాన్ కష్టాల్లో పడింది. అయితే ఆల్​రౌండర్ మహ్మద్ నబీ (47) ఆఖరి వరకు పోరాడాడు. ఖాయిస్ అహ్మద్ (18) అతడికి మంచి సపోర్ట్ అందించాడు. కానీ లాభం లేకపోయింది. విజయానికి 11 పరుగుల దూరంలో ఆఫ్ఘాన్ ఆలౌట్ అయింది. బ్యాటర్ల ఫెయిల్యూర్ వల్లే ఆ టీమ్ ఓటమిపాలైంది. యూఏఈ బౌలర్లలో మహ్మద్ జవాదుల్లా, అలీ నాసిర్ చెరో 4 వికెట్లతో ఆఫ్ఘాన్ వెన్ను విరిచారు. మరి.. వరల్డ్ కప్​ పెర్ఫార్మెన్స్​తో ఫుల్ జోష్​లో కనిపించిన ఆఫ్ఘాన్​కు యూఏఈ షాకివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Shubman Gill: వైర​ల్ అవుతున్న గిల్ బకెట్ లిస్ట్.. అన్ని సాధించినా అసలైందే మిస్సయింది!