iDreamPost

Shubman Gill: వైర​ల్ అవుతున్న గిల్ బకెట్ లిస్ట్.. అన్ని సాధించినా అసలైందే మిస్సయింది!

  • Published Jan 01, 2024 | 10:34 AMUpdated Jan 01, 2024 | 10:34 AM

టీమిండియా యంగ్ క్రికెటర్ శుబ్​మన్ గిల్ బకెట్ లిస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఇందులోని అన్నింటినీ గిల్ సాధించాడని.. కానీ అసలైందే మిస్సయిందని అంటున్నారు.

టీమిండియా యంగ్ క్రికెటర్ శుబ్​మన్ గిల్ బకెట్ లిస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఇందులోని అన్నింటినీ గిల్ సాధించాడని.. కానీ అసలైందే మిస్సయిందని అంటున్నారు.

  • Published Jan 01, 2024 | 10:34 AMUpdated Jan 01, 2024 | 10:34 AM
Shubman Gill: వైర​ల్ అవుతున్న గిల్ బకెట్ లిస్ట్.. అన్ని సాధించినా అసలైందే మిస్సయింది!

ఏ రంగంలోనైనా కొత్త నీరు రావాలి. అప్పుడే ఆశించిన దాని కంటే వేగంగా రిజల్ట్స్, ఛేంజెస్ వస్తాయి. అందుకు స్పోర్ట్స్ కూడా మినహాయింపేమీ కాదు. సీనియర్ ఆటగాళ్లకు తోడు, యంగ్​స్టర్స్ కూడా తోడైతేనే టీమ్స్ మరింత బలోపేతం అవుతాయి. సీనియర్ల అనుభవానికి యువకుల జోష్ తోడైతే ఇక ఆ జట్టును ఆపడం చాలా కష్టమవుతుంది. అందుకే ప్రతిభ కలిగిన యువకులను వెతికి మరీ పట్టుకుంటారు సెలక్టర్స్. సీనియర్లు ఉండగానే వారిని తయారు చేసుకుంటారు. క్రికెట్​లోనూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతారు. అలా టీమ్​లోకి వచ్చిన ప్లేయరే శుబ్​మన్ గిల్. ఐపీఎల్​ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ క్రికెటర్.. గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్​లో ఉన్నాడు. ముఖ్యంగా 2023 మొత్తం అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. మిగిలిన యంగ్​స్టర్స్​తో పోల్చుకుంటే గిల్ తక్కువ టైమ్​లోనే ఎంతో అచీవ్ చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ టీమ్​లో రెగ్యులర్ ప్లేయర్​గా మారాడు. అయితే దీనికి ఏడాది మొదట్లోనే స్కెచ్ వేశాడు గిల్.

2023 స్టార్ట్ కాకముందే తన ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాడు శుబ్​మన్ గిల్. 2022 డిసెంబర్ 31న తర్వాతి ఏడాది ఏమేం సాధించాలో ఒక కాగితంపై రాసుకున్నాడు. అతడి బకెట్ లిస్ట్​కు సంబంధించిన ఆ పేపర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ప్రధానంగా నాలుగు గోల్స్ పెట్టుకున్నాడు శుబ్​మన్. టీమిండియా తరఫున అత్యధిక సెంచరీలు కొట్టాలి, తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి, గేమ్​లో తన బెస్ట్ ఎఫర్ట్ పెట్టాలి, అలాగే వరల్డ్‌ కప్ నెగ్గాలి. ఇది 2023 కోసం గిల్ రాసి పెట్టుకున్న బకెట్ లిస్ట్. అయితే ఈ జాబితాలో అతడు మూడు మాత్రమే సాధించాడు. అత్యధిక సెంచరీలు బాదాడు గిల్. కానీ దాన్ని తర్వాత విరాట్ కోహ్లీ అధిగమించాడు. కుటుంబ బాగోగులు చూసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. టీమ్ కోసం బ్యాటింగ్, ఫీల్డింగ్​లో తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నాడు.

gill bucket list viral

బకెట్ లిస్ట్​లో నాలుగో లక్ష్యాన్ని మాత్రం నిజం చేసుకోలేకపోయాడు గిల్. అదే వరల్డ్ కప్. ఈసారి మెగా టోర్నీలో భారత్​ను విజేతగా చూడాలని మిగిలిన క్రికెటర్స్​, అభిమానుల్లాగే శుబ్​మన్ కూడా కలలు కన్నాడు. కానీ అది నిజం కాలేదు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్​లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి టీమిండియా కప్పు చేజార్చుకున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీకి ముందు డెంగ్యూ బారిన పడిన గిల్ సరిగ్గా ఆడలేకపోయాడు. అంతకుముందు వరకు భీకర ఫామ్​లో ఉన్న ఈ యంగ్​స్టర్.. వరల్డ్ కప్​లో ఆశించినంత స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. దీంతో గిల్ కూడా తీవ్రంగా నిరాశపడ్డాడు. గతేడాది బకెట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడమే గాక దాంట్లోని చాలా గోల్స్​ను రీచ్ అయ్యాడు. ఈసారి అతడి బకెట్‌ లిస్ట్ ఏంటనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. గుజరాత్ టైటాన్స్​ కెప్టెన్​గా ఎంపికయ్యాడు కాబట్టి ఐపీఎల్ ట్రోఫీ, అలాగే టీ20 వరల్డ్ కప్-2024 కప్ అతడి బకెట్ లిస్ట్​లో తప్పకుండా ఉంటాయని చెప్పొచ్చు. మరి.. గిల్ బకెట్ లిస్ట్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్న కోహ్లీ.. మెస్సీ, రొనాల్డోలను ఓడించి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి