iDreamPost
android-app
ios-app

15 ఏళ్ల కెరీర్.. ఆడింది రెండు టెస్టులే! రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

  • Published Mar 08, 2024 | 2:56 PM Updated Updated Mar 08, 2024 | 2:56 PM

35 ఏళ్ల స్టార్ క్రికెటర్ తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఇన్ని సంవత్సరాల కెరీర్ లో కేవలం 2 టెస్టులు మాత్రమే ఆడాడు. మరి ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

35 ఏళ్ల స్టార్ క్రికెటర్ తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఇన్ని సంవత్సరాల కెరీర్ లో కేవలం 2 టెస్టులు మాత్రమే ఆడాడు. మరి ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

15 ఏళ్ల కెరీర్.. ఆడింది రెండు టెస్టులే! రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు ఓ స్టార్ ప్లేయర్. ఇటీవలే టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఆడింది మాత్రం కేవలం రెండు టెస్టులు మాత్రమే. 35 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ 2009లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. తాజాగా తన కెరీర్ కు వీడ్కోలు పలికాడు. మరి ఆ స్టార్ క్రికెటర్ ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నూర్ అలీ జద్రాన్.. ఆఫ్గానిస్తాన్ వెటరన్ ప్లేయర్. 2009లో స్కాట్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇటీవలే శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. కానీ రెండో టెస్టే తనకు చివరి మ్యాచ్ అవుతుందని ఊహించలేదనుకుంటా. తాజాగా తన ఇంటర్నేషనల్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. ఇటీవలే తన అల్లుడి చేత క్యాప్ అందుకుని జట్టులోకి వచ్చిన జద్రాన్ రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక జద్రాన్ కెరీర్ విషయానికి వస్తే.. ఆఫ్గాన్ తరఫున 51 వన్డేలు ఆడి 1216 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 22 టీ20ల్లో586 రన్స్ చేశాడు. రెండు టెస్టుల్లో 117 పరుగులు చేశాడు నూర్ అలీ జద్రాన్. కాగా.. చివరగా ఐర్లాండ్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో ఆడాడు. 2010 టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై ఫిఫ్టీ కొట్టి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు జద్రాన్. మరి 15 ఏళ్ల కెరీర్ కు గుడ్ బై చెప్పిన ఈ వెటరన్ ప్లేయర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: సేమ్‌ బాల్‌.. మొన్న హెల్మెట్‌కి, నేడు బౌండరీ లైన్‌ బయటకి! బ్యాట్‌తో రోహిత్‌ ఆన్సర్‌