iDreamPost
android-app
ios-app

వీడియో: సేమ్‌ బాల్‌.. మొన్న హెల్మెట్‌కి, నేడు బౌండరీ లైన్‌ బయటకి! బ్యాట్‌తో రోహిత్‌ ఆన్సర్‌

  • Published Mar 08, 2024 | 1:55 PM Updated Updated Mar 09, 2024 | 6:34 PM

Rohit Sharma vs Mark Wood: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ సూపర్‌ సిక్స్‌తో మార్క్‌వుడ్‌కు బుద్ధి వచ్చేలా చేశాడు. ప్రస్తుతం మార్క్‌ వుడ్‌ చేసిన యాక్షన్‌కి.. రోహిత్‌ ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది. దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Rohit Sharma vs Mark Wood: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ సూపర్‌ సిక్స్‌తో మార్క్‌వుడ్‌కు బుద్ధి వచ్చేలా చేశాడు. ప్రస్తుతం మార్క్‌ వుడ్‌ చేసిన యాక్షన్‌కి.. రోహిత్‌ ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది. దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Mar 08, 2024 | 1:55 PMUpdated Mar 09, 2024 | 6:34 PM
వీడియో: సేమ్‌ బాల్‌.. మొన్న హెల్మెట్‌కి, నేడు బౌండరీ లైన్‌ బయటకి! బ్యాట్‌తో రోహిత్‌ ఆన్సర్‌

ధర్మశాల వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. తొలి రోజు 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రోహిత్‌.. రెండో రోజు అదే జోరును కొనసాగించి.. సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. 154 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ.. ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌పై బదులు తీర్చుకున్నాడు. తన స్ట్రెంత్‌పై దెబ్బ కొట్టాలని చూస్తే.. తాను ఎలా రియాక్ట్‌ అవుతానో మార్క్‌కు రుచి చూపించాడు. ఇంతకీ మార్క్‌ వుడ్‌-రోహిత్‌ శర్మ మధ్య ఏం జరిగిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

భారత్‌ ఇంగ్లండ్‌ మధ్య మొత్తం ఐదు టెస్టుల సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌ వేదికగా ఈ రెండు జట్ల మధ్య మూడో టెస్టు జరిగింది. ఈ టెస్టులో కూడా రోహిత్‌ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. కానీ, ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ బౌన్సర్లు, షాట్‌ బాల్స్‌ వేస్తూ రోహిత్‌ను కాస్త ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలోనే మరింత వేగం పెంచి.. రోహిత్‌ శర్మ ఫేస్‌ను టార్గెట్‌గా చేసుకుని.. మార్క్‌ వుడ్‌ షార్ట్‌ బాల్స్‌ను సంధించాడు.

నిజానికి రోహిత్‌ శర్మకు షార్ట్‌ బాల్స్‌ వేస్తే పండుగే. ఎంతో అద్భుతంగా వాటిని పుల్‌షాట్స్‌ ఆడుతూ.. ఫోర్లు, సిక్సులు రాబడుతూ ఉంటాడు. కానీ, మార్క్‌ వేస్తున్న పేస్‌, బౌన్స్‌ ఎక్కువగా ఉండటంతో ఓ బాల్‌ వేగంగా దూసుకొచ్చి.. రోహిత్‌ హెల్మెట్‌కు తాకింది. దాంతో తాను రోహిత్ శర్మపై తానేదో విజయం సాధించినట్లు మార్క్‌ వుడ్‌ ఫీలైపోయాడు. ప్రస్తుతం ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో కూడా రోహిత్‌ శర్మపై అలాంటి స్ట్రాటజీనే ప్రదర్శించాడు మార్క్‌ వుడ్‌. కానీ, ఈ సారి లెక్క మారింది. తన బలమేంటో రోహిత్‌ చూపించాడు.

ఎప్పుడో ఒకసారి లెక్క తప్పుతాం కానీ ప్రతిసారీ అలా జరగదు బ్రో.. అన్నట్లు మార్క్‌ వుడ్‌కు మెంటలెక్కేలా.. తన పుల్‌షాట్‌ పవరేంటో చూపించాడు రోహిత్‌ శర్మ. గంటకు 151.2 కిలో మీటర్ల వేగంతో ముఖం పైకి దూసుకొస్తున్న బంతిని రోహిత్‌ శర్మ అంతే వేగంగా ఫైన్‌లెగ్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదాడు. దీంతో.. తనను ప్రతిసారి షార్ట్‌ డెలవరీలు వేసి, బౌన్సర్ల వేసి అడ్డుకోలేవని మార్క్‌వుడ్‌కు రోహిత్‌ చెప్పకనేచెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మూడో టెస్టులో రోహిత్‌ హెల్మెట్‌కు తగిలిన బాల్‌కు ప్రతీకారంగా ఈ టెస్టులో రోహిత్‌ సేమ్‌ బాల్‌కు సిక్స్‌ బాదాడని అభిమానులు చెబుతున్నారు. ఆ రెండు వీడియోలను కలిపి యాక్షన్‌, రియాక్షన్‌ అంటూ తెగ షేర్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by @crick8_flix

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet