iDreamPost

గుంటూరు కారం ఈవెంట్‌ కోసం శ్రీలీల కట్టిన చీర ధర అన్ని లక్షలా?

  • Published Jan 10, 2024 | 1:41 PMUpdated Jan 11, 2024 | 12:28 PM

సాధారణంగా సెలెబ్రిటీలు అంటే కాస్టలీ దుస్తులు ధరిస్తారని అందరికి తెలుసు. అయితే, ఈ మధ్య కొంతమంది అభిమానులు ఆన్ లైన్ లో ఆ దుస్తుల ధరను పోల్చడం మొదలెట్టారు. తాజాగా ఇప్పుడు నటి శ్రీ లీల దుస్తుల ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సాధారణంగా సెలెబ్రిటీలు అంటే కాస్టలీ దుస్తులు ధరిస్తారని అందరికి తెలుసు. అయితే, ఈ మధ్య కొంతమంది అభిమానులు ఆన్ లైన్ లో ఆ దుస్తుల ధరను పోల్చడం మొదలెట్టారు. తాజాగా ఇప్పుడు నటి శ్రీ లీల దుస్తుల ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

  • Published Jan 10, 2024 | 1:41 PMUpdated Jan 11, 2024 | 12:28 PM
గుంటూరు కారం ఈవెంట్‌ కోసం శ్రీలీల కట్టిన చీర ధర అన్ని లక్షలా?

సహజంగా అభిమానులు తమ ఫేవరేట్ తారలను ఫాలో అవుతూ ఉంటారు. వారికీ సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాలలో.. ఎపుడెపుడు కనిపిస్తాయ అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇంకా ఒక్కసారి తమ అభిమాన తారలు ఏదైనా ఈవెంట్ లో కనిపించారంటే చాలు.. వెంటనే వారి ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు నెటిజన్లు. అలాగే, ఈ మధ్య వారి ఫేవరేట్ తారల ఫొటోలతో పాటూ.. వారు వేసుకున్న దుస్తుల ధర కూడా వైరల్ అవుతుంది. ఈ క్రమంలో హీరోయిన్ శ్రీ లీల తాజాగా ఓ ఈవెంట్ లో కట్టుకున్న చీర ధర ఇప్పుడు వైరల్ అవుతుంది. దీని ధర తెలుసుకున్న నెటిజన్లు ఔరా అంటూ నోరు వెళ్లబెడుతున్నారు.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీ లీల. దాదాపు ఇటీవల కాలంలో వచ్చిన అందరి బడా హీరోల చిత్రాలలో ఈ భామ నటించింది. సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన నాటి నుంచి ఈరోజు వరకు.. ఆమె తన అందంతో అభినయంతో అందరి హృదయాలను దోచేసుకుంది. కేవలం సినిమాలలోనే కాకుండ ఈ ముద్దుగుమ్మ ఏ ఈవెంట్ కు అటెండ్ అయినా.. ఎంతో పద్దతిగా రెడీ అవుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” చిత్రంలో.. ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో శ్రీ లీల గ్రీన్ కలర్ చీరలో కనిపించి.. తన వయ్యారంతో కుర్ర కారు ఎదను దోచేసుకుంది. ప్రస్తుతం శ్రీ లీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, కొంతమంది నెటిజన్లు ఈ అమ్మడు కట్టిన చీర ధరను ఆన్ లైన్ లో సెర్చ్ చేశారు. దీని ధర చూసిన నెటిజన్లు నోటి మీద వేలేసుకున్నారు. ఎందుకంటే దీని ధర అక్షరాలా రూ.1,59,000. మరి, కేవలం ఒక ఈవెంట్ కోసం ఇంత ఖరీదైన దుస్తులు ధరించడం చూస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దీనితో ప్రస్తుతం శ్రీ లీల ఫొటోలతో పాటు.. ఆమె ధరించిన దుస్తుల ధర కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

sree leela sarry

కాగా, మరో రెండు రోజుల్లో “గుంటూరు కారం” చిత్రం థియేటర్ లో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం మీద.. ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే, విడుదల చేసిన ట్రైలర్, కొన్ని సాంగ్స్ లో విజువల్స్ లు గమనిస్తే.. సినిమా పేరుకు తగినట్టుగానే కథ కూడా ఎంత మాస్ గా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఇక, ఇందులో శ్రీ లీల యాక్టింగ్, డాన్స్, ఎనర్జీ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి, జనవరి 12న థియేటర్ లో విడుదల కానున్న గుంటూరు కారం.. ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఏదేమైనా,ఇలా నటి నటులు ఏదైనా ఈవెంట్ లో కాస్టలీ బట్టలు ధరిస్తే.. వాటిని ఆన్ లైన్ ప్రైస్ తో పోల్చుతూ వాటిని వైరల్ చేయడం కొత్త ట్రెండ్ గా మారిపోయింది. మరి, తాజాగా వైరల్ అవుతున్న శ్రీ లీల ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి