iDreamPost

Pic Talk: చేతిలో బిడ్డతో.. సానియా పక్కన​ ఉన్న ఈమె స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో తెలుసా!

  • Published Jun 17, 2024 | 9:51 AMUpdated Jun 17, 2024 | 9:51 AM

చాలా మంది నటి నటులు.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. కేవలం కొన్ని సినిమాలలో అలరించి.. ఆ తర్వాత అనేక కారణాల వలన ఇండస్ట్రీకి దూరమైపోతు ఉంటారు. ఆ తర్వాత ఎక్కడో ఓ దగ్గర టక్కున కెమెరాలకు చిక్కి.. సోషల్ మీడియాలో ప్రత్యేక్షమవుతారు.

చాలా మంది నటి నటులు.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. కేవలం కొన్ని సినిమాలలో అలరించి.. ఆ తర్వాత అనేక కారణాల వలన ఇండస్ట్రీకి దూరమైపోతు ఉంటారు. ఆ తర్వాత ఎక్కడో ఓ దగ్గర టక్కున కెమెరాలకు చిక్కి.. సోషల్ మీడియాలో ప్రత్యేక్షమవుతారు.

  • Published Jun 17, 2024 | 9:51 AMUpdated Jun 17, 2024 | 9:51 AM
Pic Talk: చేతిలో బిడ్డతో.. సానియా పక్కన​ ఉన్న ఈమె స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో తెలుసా!

చిన్నప్పుడు క్యూట్ గా ఉన్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. అప్పట్లో కుర్రాళ్ళ గుండెలను పిండేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా అంటూ.. ఇలా ఈ మధ్యన సోషల్ మీడియాలో అనేక మంది స్టార్ సెలెబ్రిటీల ఫొటోస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే . అయితే సెలెబ్రిటీల చైల్డ్ హుడ్ ఫొటోస్ సంగతి పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటి నటులు వారి చైల్డ్ తో దిగిన ఫొటోస్ మాత్రం అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. చాలా మంది నటి నటులు.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. కేవలం కొన్ని సినిమాలలో అలరించి.. ఆ తర్వాత అనేక కారణాల వలన ఇండస్ట్రీకి దూరమైపోతు ఉంటారు. ఆ తర్వాత ఎక్కడో ఓ దగ్గర టక్కున కెమెరాలకు చిక్కి.. సోషల్ మీడియాలో ప్రత్యేక్షమవుతారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పెట్టేయండి మరి.

సానియా మీర్జా డివోషనల్ టూర్ కు బయల్దేరిన సంగతి తెల్సిందే. ఆమెతో పాటు ఆమె చెల్లెలు ఆనమ్ మీర్జా.. ఇంకా కొంతమంది కూడా వెళ్లారు. అయితే తాజాగా వారి టూర్ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ ను షేర్ చేశారు. అయితే ఆ ఫొటోలో సానియా పక్కన ఓ పసికందును ఎత్తుకుని.. ఓ లేడీ ఉంది. దీనితో ఈ ఫోటోను చూసిన నెటిజన్లు.. ఆమెను ఎక్కడ చూసినట్లు ఉందని.. ఆమె గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశారు. ఆమె మరెవరో కాదు ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్.. నాగార్జున, కల్యాణ్ రామ్, మంచు మనోజ్ లాంటి ఎంతో మందితో కలిసి సినిమాలలో నటించింది. తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి.. ఎంతో మంది అభిమానుల మన్ననను పొందింది. బాలీవుడ్ లో సల్మాన్‌ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి బడా హీరోలతో సైతం ఈమె స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక చాలా మంది సెలెబ్రిటీలు పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తే.. ఈ అమ్మడు మాత్రం పెళ్ళికి ముందే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది.

ఇంతకీ ఈ అమ్మడు మరెవరో కాదు.. సనాఖాన్. కళ్యాణ్ రామ్ సినిమా కత్తి.. నాగార్జునతో గగనం లాంటి సినిమాలలో నటించి.. మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత వరుసగా తెలుగు, కన్నడ, తమిళం, హిందీ సినిమాలలో ఈ అమందు నటించింది. కారణం ఏమై ఉంటుందో తెలీదు కానీ.. కెరీర్ మంచి స్థాయిలో ఉండగానే ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత అనస్ సయ్యద్‌ తో ఈ అమ్మడికి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులకు 11 నెలల బాబు ఉన్నాడు. ఇక సనా ఖాన్ కూడా ప్రస్తుతం డివోషనల్ టూర్ లోనే ఉంది. ఈ క్రమంలోనే అనుకోకుండా సానియా మీర్జాను కలిసింది. దీనితో వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Lollywoodsparkoffical_ (@lollywoodsparkofficial_)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి