iDreamPost

ఓ వ్యక్తిపై స్టార్ హీరోయిన్ రూ. 100 కోట్ల పరువు నష్టం కేసు! కారణం ఏంటంటే?

ఓ స్టార్ హీరోయిన్ తన పరువుకు భంగం కలిగించాడు అంటూ ఓ వ్యక్తిపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఓ స్టార్ హీరోయిన్ తన పరువుకు భంగం కలిగించాడు అంటూ ఓ వ్యక్తిపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఓ వ్యక్తిపై స్టార్ హీరోయిన్ రూ. 100 కోట్ల పరువు నష్టం కేసు! కారణం ఏంటంటే?

తమ పరువుకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే.. తప్పుడు రాతలు రాస్తే.. సదరు వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తారు. ఇలాంటి కేసులు ఎక్కువగా రాజకీయాల్లో, సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంటాయి. తాజాగ ఓ స్టార్ హీరోయిన్ తన పరువుకు భంగం కలిగించాడు అంటూ ఓ వ్యక్తిపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఇంత భారీ మెుత్తంలో పరువు నష్టం దావా వేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

రవీనా టాండన్.. ఈ సినియర్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ తో పాటుగా ఇతర భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి.. తనకంటూ స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకుంది. తన కెరీర్ లో అన్ని రకాల పాత్రల్లో నటించింది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. రవీనా టాండన్ కొన్ని రోజుల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రవీనా, ఆమె డ్రైవర్ మద్యం తాగి రాష్ డ్రైవింగ్ చేశారని వారిపై కొందరు ఫిర్యాదు చేశారు. ‘మాపై దాడి చేయకండి’ అని రవీనా రిక్వెస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం కూడా తెలియనిది కాదు.

Raveena Tandon

కాగా.. ఈ ఘటనపై తనను తాను ప్రీ లాన్సింగ్ జర్నలిస్ట్ గా చెప్పుకునే షేక్ మోసిన్ అనే వ్యక్తి.. రవీనా ఆరోజు మద్యం తాగి ఉందని, కోర్టు ధృవీకరించినప్పటికీ.. ఆమె తప్పును ఒప్పుకోలేదని వార్తలను ప్రచారం చేశాడు. అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనపై పూర్తి విచారణ చేసిన ఆమె మద్యం తాగలేదని, అసలు ఈ ఘటనలో రవీనా కారు ఎవ్వరినీ ఢీ కొనలేదని నిర్ధారించారు. దాంతో తన పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాసిన మోసిన్ కు లీగల్ నోటీసులు పంపించింది. దాంతో పాటుగా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఆ నోటీసుల్లో పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేసి, తన పరువుకు భంగం కలిగించాడని ఇందులో పేర్కొంది. మరి ఈ విషయంలో ఆ వ్యక్తి ఏ విధంగా స్పందించాడో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి