iDreamPost
android-app
ios-app

పాపం పాయల్.. అదృష్టం లేని ఓ టాలెంటెడ్ హీరోయిన్!

ఎంతో మంది హీరోయిన్లు ఎంతో టాలెంట్ ఉన్న కూడా అదృష్టం కలిసి రాక వెండితెరకు దూరమవుతున్నారు. మరికొందరు తమ కెరీర్ బిల్డ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలానే ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ కూడా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఎంతో మంది హీరోయిన్లు ఎంతో టాలెంట్ ఉన్న కూడా అదృష్టం కలిసి రాక వెండితెరకు దూరమవుతున్నారు. మరికొందరు తమ కెరీర్ బిల్డ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలానే ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ కూడా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.

పాపం పాయల్.. అదృష్టం లేని ఓ టాలెంటెడ్ హీరోయిన్!

మనిషికి టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి.  ఏ రంగంలోనైనా కష్టంతో పాటు ఆవగింజ అంత అదృష్టం  ఉండాలి.  ఎంత టాలెంట్ ఉన్నా కూడా  అదృష్టం లేకపోతే ఎవరు గుర్తించారు. ఇది సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎంతో మంది హీరోయిన్లకు టాలెంట్ ఉన్నా కూడా లక్ పక్కకు నెట్టేస్తుంది.  దీంతో  అదృష్టం లేని టాలెంటెడ్ హీరోయిన్ల జాబితాలోకి చేరుతుంటారు. ఇలా ఎందరో హీరోయిన్లు అదృష్టం లేక వెండితెరకు కనుమరుగయ్యారు. అలాంటి వారిలో ఆర్ఎక్స్ 100 బ్యూటీ  పాయల్ రాజ్ పుత్ కూడా ఉన్నారని ఇండస్ట్రీలో టాక్.  ఎంతో టాలెంట్ ఉన్న పాయల్.. కు అదృష్టం లేక అవకాశలు ఎక్కువగా రావడం లేదని టాక్.

పాయల్ రాజ్ పుత్.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం పేరు ఇది. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే అటు నటిగా, ఇటు గ్లామర్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. తొలి మూవీ తో పాయల్ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా కుర్రాళ్లు ఆమెను ఓ అందాల దేవతగా ఆరాధించారు.  ఆర్ఎక్స్ 100  తరువాత పాయల్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. పక్కాగా ఈ బ్యూటీ కమర్షియల్ హీరోయిన్ అవుతుందని అందరూ ఊహించారు. అలానే వెంకీమామ, డిస్కోరాజా సినిమాల్లో స్టార్ హీరోలతో నటించింది.

ఆ తరువాత అనుకున్న స్థాయిలో ఈ అమ్మడి కెరీర్ ముందుకి సాగలేదు. రెండు, మూడు లేడీ ఓరియెంటెండ్ సినిమాలు చేసిన అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ భామను బోల్డ్ క్యారెక్టర్స్ లోనే చూపించడానికి అందరూ ఇష్టపడుతున్నారు. క్రమంగా పాయల్ కి అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో మరల ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన అజయ్ భూపతి.. మంగళవారం సినిమాతో మరోసారి అవకాశం ఇచ్చారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది.  అయితే  ఈ సినిమాలో పాయల్  చేసిన శైలు క్యారెక్టర్  బోల్డ్ గా ఉంటుంది. వల్గారిటీ లేకపోయిన పాయల్ తప్ప ఇంకెవరు ఈ పాత్ర చేయలేరేమో అనిపించేలా ఈ అమ్మడు మెప్పించింది.  కథ అంత ఆమె చుట్టూనే కూడా తిరుగుతుంది.

 థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమాతో పాయల్ మంచి సక్సెస్ అయితే అందుకుంది. కానీ నటిగా మరల తనకి కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం రావడం లేదు. ఇలా ఎంతో టాలెంట్ ఉన్న పాయల్ కి అదృష్టం లేక.. అవకాశాలు లేనట్లయ్యిందని టాక్ వినిపిస్తోంది.  మంగళవారం కచ్చితంగా తనని కమర్షియల్ హీరోయిన్ గా చేస్తుందని ఆశించింది. కానీ  మూవీ విడుదలైన తరువాత పరిస్థితి మరోదారిలో ఈ అమ్మడిని నడిపిస్తోంది. ఈ సినిమా హిట్ తో ప్రస్తుతం ఆమె అవకాశాలు వస్తున్నాయి. వాటిలో  చాలా వరకు ఫిమేల్ సెంట్రిక్ కథలే, అందులోనూ బోల్డ్ పాత్రలతో నడిచే కథలే అని తెలుస్తోంది. మరి.. వీటిలో మంచివాటిని ఎంపిక చేసుకుని తన కెరియర్ ని బిల్డ్ చేసుకునే పనిలో పడింది.. ఈ పంజాబీ బ్యూటీ . మరి.. పాయల్ రాజ్ పుత్ కెరీర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın aljojobet güncelHoliganbet Girişjojobet günceljojobet güncel