iDreamPost

సిల్క్ స్మిత చేసిన అతి పెద్ద తప్పు ఏంటో చెప్పిన నటి జయమాలిని!

  • Published Mar 19, 2024 | 8:46 AMUpdated Mar 19, 2024 | 8:46 AM

మత్తెక్కించే కళ్లు, తన అందచందాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటి, అతి చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం వెనుక ఆమె చేసిన ఆ తప్పే కారణం అంటూ తాజాగా ఓ నటి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మత్తెక్కించే కళ్లు, తన అందచందాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటి, అతి చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం వెనుక ఆమె చేసిన ఆ తప్పే కారణం అంటూ తాజాగా ఓ నటి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • Published Mar 19, 2024 | 8:46 AMUpdated Mar 19, 2024 | 8:46 AM
సిల్క్ స్మిత చేసిన అతి పెద్ద తప్పు ఏంటో చెప్పిన నటి జయమాలిని!

‘సిల్క్ స్మిత’.. ఒకప్పుడు సినీపరిశ్రమలో ఈ పేరు మారుమోగిపోయేది.మత్తెక్కించే కళ్లు.. తన అందచందాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఈ క్రమంలోనే.. దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది సిల్క్ స్మిత. అలాగే, అప్పట్లో ఆమె కోసమే ప్రతి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండేలా చూసుకునేవారు దర్శకనిర్మాతలు. ఇక సిల్క్ డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం ఎదురుచూసేవారు. కాగా, స్టార్ హీరోహీరోయిన్లకు మించిన పారితోషికం తీసుకున్న ఏకైక నటి సిల్క్ స్మిత.అయితే, తెరపై అందచందాలతో ప్రేక్షకులకు కవ్వించిన సిల్క్ స్మిత.. జీవితంలో మాత్రం చాలా కన్నీటి యథా ఉంది. కేవలం 35 ఏళ్ల వయసులోనే సిల్క్ స్మిత ఆత్మ హత్య చేసుకొని చనిపోవడానికి వెనుక.. ఆమె చేసిన పెద్ద తప్పు కారణమంటూ సీనియర్ నటి జయమాలిని పేర్కొన్నారు.

ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటి, అతి చిన్న వయసులోనే క్షణికావేశంలో జీవితం మీద విరక్తి పుట్టి 1996లో బలవన్మరణానికి పాల్పడింది. అయితే సిల్క స్మిత అలా ఎందుకు ప్రాణాలు తీసుకుందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. కాగా, అప్పట్లో స్మితతో పాటు పలు సినిమాల్లో చేసిన జయమాలిని.. తాజాగా ‘స్మిత మరణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. అతి తక్కువ కాలంలోనే పేరు, ప్రఖ్యాతలతో పాటు డబ్బు సంపాదించిన నటి సిల్క్ స్మిత. కానీ, స్మిత షూటింగ్ స్పాట్ లో నాతో ఎప్పుడు మాట్లాడేది కాదు. అయితే, ఓ సినిమాలో మాత్రం హీరోతో కలిసి నేను, మా అక్క జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత నటించాము. కానీ, కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సిల్క్ స్మిత ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరం. అదే ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఎందుకంటే.. ప్రేమించడం తప్పు కాదు. కానీ, తల్లిదండ్రులను విడచిపెట్టి మరి ఉండకూడదు. అసలు స్మిత ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మేసింది. అతడు ఆమెను బాగా మోసం చేశాడు. అదే సమయంలో ఆమె పక్కన తల్లిదండ్రులు ఉండుంటే.. బాధలో ఆమెకు అండగా ఉండేవారు. ఇక అయిన వాళ్లు లేకపోతే చాలామంది మోసం చేయడానికి రెడీగా ఉంటారు. అలానే సిల్క్ స్మిత జీవితం కూడా ముగిసిపోయింది’ అని జయమాలిని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

jayama malini shocking comments on silk smitha

ఇక సిల్క్ స్మిత మొదట్లో హీరోయిన్లకు మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఆ సమయంలోనే తాను కూడా హీరోయిన్ కావాలనుకుంది. ఈ క్రమంలోనే ఆమె మొదట 1979లో మలయాళం సినిమా ఈనాయే తేది చిత్రంలో తొలిసారిగా నిటంచింది. అదే ఏడాదిలో తమిళంలో కూడా పండిచక్రమ్ అనే సినిమాలో సిల్క్ అనే పాత్రలో నటించింది. ఆ తర్వాత తన పేరును సిల్క్ స్మితగా మార్చుకుంది.ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని ఊహించని స్టార్ డమ్ అందుకుంది. తన మ్యాజిక్ నటనతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. అప్పట్లో సిల్క్ లేకపోతే సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ సైతం ముందుకు రాలేదంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కేవలం 17 ఏళ్ల వయసులోనే దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించింది. మరి, అంత స్టార్ స్టెటస్ ను సంపాదించుకున్న నటి ఆత్మహత్య చేసుకొని చనిపోవడటం పై నటి జయమాలిని చేసే వ్యాఖ్యల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి