iDreamPost

ఈ ఫోటోలోని చిన్నారి.. అభిమానుల పాలిట దేవతరా

ఓ అబ్బాయితో కలిసి ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ టామ్ బాయ్.. ఇప్పుడో స్టార్ హీరోయిన్. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. హీరోయిన్ అయ్యి ఫిదా చేసేసింది. చివరకు ఆమెను ప్రేక్షకులు దేవతను చేేసేశారు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం

ఓ అబ్బాయితో కలిసి ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ టామ్ బాయ్.. ఇప్పుడో స్టార్ హీరోయిన్. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. హీరోయిన్ అయ్యి ఫిదా చేసేసింది. చివరకు ఆమెను ప్రేక్షకులు దేవతను చేేసేశారు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం

ఈ ఫోటోలోని చిన్నారి.. అభిమానుల పాలిట దేవతరా

ఈ ఫోటోలో ఉన్న పాపను చూశారా.. ఎవరో గుర్తు పట్టగలరా..? ఆమె ఒక స్టార్ హీరోయిన్. తెలుగులో ఫస్ట్ మూవీతోనే విపరీతమైన పాపులారిటీని తెచ్చుకుంది. జూనియర్ ఎన్టీఆర్, అల్లుఅర్జున్, ప్రభాస్, నితిన్, రామ్, సిద్దార్థ, మంచు విష్ణు, రవితేజ, గోపిచంద్, సందీప్ కిషన్ వంటి స్టార్ హీరోలతో జతకట్టింది. కానీ ఆమెకు కోలీవుడ్‌లో వచ్చినంత క్రేజ్ టాలీవుడ్‌లో రాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది. చైల్డ్ ఆర్టిస్టుగా అలరించి.. 16 ఏళ్లలో హీరోయిన్ అయిపోయి.. ఇప్పటికే 50కి పైగా చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ బిజియెస్హ్ నటీమణిగానే కొనసాగుతుండటం విశేషం. ఆమె హార్ట్ కూడా చాలా పెద్దది.

ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్.. 31 మంది పిల్లలకు తల్లి.  అదెలా అనుకుంటున్నారా..? ఆమెలాగే ఆమె మనస్సు కూడా అందమైనది. పిల్లలను దత్తత తీసుకుని పెంచుతోంది. ప్రేమ విషయంలో ఓ సారి తప్పడుగు వేసింది. ఆ తర్వాత సరిదిద్దుకుని ఓ వ్యక్తిని మనువాడింది. అప్పటికీ ఆమెపై విమర్శలు తగ్గలేదు. ఫ్రెండ్ భర్తనే కొట్టాశావ్ అంటూ తిట్టాయి కొన్ని నోళ్లు. కానీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి అవే నోళ్లను మూయించింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..కోలీవుడ్ ప్రేక్షకులు దేవతగా పిలుచుకునే హన్సిక మోత్వానీ. హవా, కోయి మిల్ గయా, జాగో, హమ్ కౌన్ హయ్ వంటి చిత్రాల్లో బాల నటిగా మెప్పించిన హన్సిక.. అల్లు అర్జున్, పూరీ కాంబోలో వచ్చిన దేశ ముదురు చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి..ఇక్కడి ముద్దుగుమ్మగా మారిపోయింది.

తెలుగులో కంత్రి, బిల్లా, మస్కా, జయిభవ, సీతా రాముల కళ్యాణం లంకలో వంటి చిత్రాలు ఆమెకు నిరాశ కలిగించాయి. అంతలో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సత్తా చాటింది. దీంతో ఆమెను జూనియర్ కుష్బుగా భావించి.. గుడి కట్టేశారు అక్కడి ప్రజలు. అక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లిపోయింది. అదే సమయంలో టాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోయింది. కందిరీగ, దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద, పవర్, లక్కున్నోడు, గౌతమ్ నంద, తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్, మై నేమ్ ఈజ్ శృతి, ఇటీవల 105 మినిట్స్‌తో అలరించింది అమ్మడు. ప్రస్తుతం ఆమె చేతిలో రౌడీ బేబీ, మాన్, గాంధారీ వంటి మూడు తమిళ ప్రాజెక్టులు ఉన్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరో శింభుతో ప్రేమాయణం.. పెళ్లి పీటలు ఎక్కలేదు. చివరకు సోహెల్ కతారియా అనే వ్యక్తిని 2022లో వివాహం చేసుకుంది. ఆ సమయంలో ఆమె ఫోటోలు రిలీజ్ చేయడంతో విమర్శల పాలు అయ్యింది. ఫ్రెండ్ భర్తనే పెళ్లి చేసుకున్నావని, ఆ జంటను నువ్వే విడగొట్టావంటూ కామెంట్స్ చేశారు. కానీ దీనిపై స్టాంగ్ రిప్లై ఇచ్చింది హన్సిక. వాళ్ల మధ్య జరిగింది తనకు తెలియదని, వారిద్దరూ విడాకులు తీసుకున్నాక.. అతడ్ని వివాహం చేసుకున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటికే 50 చిత్రాలను పూర్తి చేసేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు ఓ వెబ్ సిరీస్‌తో మన ముందుకు రాబోతుంది. నషా అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది అమ్మడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి