iDreamPost
android-app
ios-app

ఎఫైర్లు నడుపుతూ అదే మంచి జీవితం అనుకుంటున్నారు.. నటి షాకింగ్ కామెంట్స్!

Actress Gayatri Reddy: నటి గాయత్రి రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. తాను స్వార్థ పరురాలిని అంటూనే.. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుం నెట్టింట ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Actress Gayatri Reddy: నటి గాయత్రి రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. తాను స్వార్థ పరురాలిని అంటూనే.. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుం నెట్టింట ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఎఫైర్లు నడుపుతూ అదే మంచి జీవితం అనుకుంటున్నారు.. నటి షాకింగ్ కామెంట్స్!

గాయత్రి రెడ్డి.. ఈ నటి పేరు చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. కానీ, ఆమె చేసిన సినిమాలు, పోషించిన పాత్రలు మాత్రం చాలామందికి తెలుసు. ఆమె బిగిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిచింది. ఆ తర్వాత గాయత్రి రెడ్డి లిస్ట్ అనే సినిమాలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా తెలుగులో హుషారు సినిమా సపోర్టింగ్ రోల్ ప్లే చేసింది. అయితే సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. సివిల్ ఇంజినీర్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఆమె ప్రస్తుతం ఆస్ట్రేలియా సెటిల్ అయిపోయింది. కానీ, తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తన అభిప్రాయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అందులో ఐ యామ్ సెల్ఫిష్ అంటూ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

గాయత్రి రెడ్డీ తనకి ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ వీడియో చేస్తూ ఉంటుంది. ఈ సెల్ఫిష్ వీడియోలో స్త్రీలకు చక్కని హెల్త్ టిప్స్ ఇచ్చింది. తన అనుభవాన్ని వారితో పంచుకుంది. తాను పిరియడ్స్ సమయంలో అస్సలు కాఫీ జోలికి వెళ్లను అని చెప్పింది. అలా కాఫీ తాగితే ఇబ్బంది ఎక్కువ అవుతుంది అని చెప్పింది. అలాగే పొత్తి కడుపులో నొప్పి పెరుగుతుంది అన్నది. మరీ తాగాలి అనిపిస్తే లెమన్ టీ, అల్లం టీ తాగుతానని చెప్పింది. అందరూ నెలసరి సమయంలో కాఫీ జోలికి వెళ్లకపోవడమే మంచిది అంటూ సూచించింది.

ఇంక తన తల్లి తనని ఎప్పుడూ సెల్ఫిష్ అంటూ ఉంటుందని.. ఆ విషయాన్ని చెప్పడానికే ఈ వీడియో చేశాను అని చెప్పుకొచ్చింది. “మా అమ్మ నన్ను సెల్ఫిష్ అంటుంది. ఆ మాట నిజమే. నాతో మంచిగా ఉండని ఫ్రెండ్స్ అందరినీ కట్ చేస్తుంటాను. నాకు కూడా ఫ్రెండ్స్ కావాలి అని ఉంటుంది. కానీ, వాళ్లు నేను ఎదగడానికి సహాయం చేయడం లేదు. వాళ్లు నా లైఫ్ లో ఉండటానికి వారికి ప్లేస్ లేదు. నేను లైఫ్ లో బాగా సెటిల్ అయ్యాను, ఎదిగాను. కానీ, వాళ్లు ఇప్పటికీ అలాగే ఉండిపోయారు. వాళ్ల సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు ఎదగడానికి సహకరించని ఎవరినీ మీ లైఫ్ లో ఫ్రెండ్స్ గా పెట్టుకోకండి.

ఫ్రెండ్స్ తో కూడా మీకు బౌండిరీలు ఉండాలి. నేను సెల్ఫిష్ పర్సనే. కానీ, నాది హెల్తీ సెల్ఫిష్. నేను నా జీవితం కోసం సెల్ఫిష్ గా ఉన్నాను. దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా లైఫ్ లో చాలా కొద్ది మంది మాత్రమే ఫ్రెండ్స్ గా ఉన్నారు. వాళ్లు నా ఎదుగదల చూసి ఆనందిస్తున్నారు. నేను కూడా నా విజయాల గురించి నిజంగా ఆనందించే వారికే వాటిని చెప్తాను. నెగిటివ్ వైబ్స్ ఉంటే వారికి బాయ్ చెప్పేయడమే. కొంతమంది మాత్రం ఎఫైర్లు నడుపుతూ అదే నిజమైన జీవితం అనుకుంటున్నారు. ప్రస్తుతం గాయత్రి రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet