iDreamPost

బస్సులో అసభ్యంగా తాకాడు.. ఎవరూ స్పందించలేదు! నటి షాకింగ్ కామెంట్స్

  • Published May 28, 2024 | 12:51 PMUpdated May 28, 2024 | 12:51 PM

Anjali Bhaskar: మహిళలకు ఎక్కడ కూడా భద్రత లేకుండా పోయిందని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. సామాన్య మహిళలకే కాదు.. సెలబ్రెటీలకు ఈ కష్టాలు తప్పడం లేదు.

Anjali Bhaskar: మహిళలకు ఎక్కడ కూడా భద్రత లేకుండా పోయిందని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. సామాన్య మహిళలకే కాదు.. సెలబ్రెటీలకు ఈ కష్టాలు తప్పడం లేదు.

  • Published May 28, 2024 | 12:51 PMUpdated May 28, 2024 | 12:51 PM
బస్సులో అసభ్యంగా తాకాడు.. ఎవరూ స్పందించలేదు! నటి షాకింగ్ కామెంట్స్

దేశంలో ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు ఈ తిప్పలు తప్పడం లేదు. కొన్నిసార్లు సినీ తారలు బయట ప్రదేశాలకు వెళ్లినపుడు అభిమానులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఆ సమయంలో నటీమణులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం అంటూ మీడియా వేదికగా తమ భాద వెల్లబుచ్చుతారు. ఇటీవల ఓ షాపింగ్ మాల్ కి వెళ్లిన నటి కాజల్ నడుపై అభిమాని చేయివేయబోయాడు.. వెంటనే అలర్ట్ అయి పక్కకు జిగింది. ఇలాంటి ఘటనలు సినీ నటులకు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఓ వ్యక్తి బస్సులో తనను అసభ్యంగా తాకాడని నటి అంజలి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే..

తమిళ విజయ్ టీవిలో ఓ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న అంజలి భాస్కర్ తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం ఆమెకు వెండితెరపై ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..‘సమాజంలో ఎంతో మంది అమ్మాయిలు ఏదో ఒక రకంగా వేధింపబడుతూనే ఉన్నారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. తొలినాళ్లలో ఫ్రెండ్స్ బట్టలు వేసుకొని షూటింగ్స్ కి వెళ్లేదాన్ని.. క్యాబ్ కి డబ్బుల్లేక బస్సుల్లో వెళ్లేదాన్ని.. ఓ రోజు బస్సులో నడి వయస్సుగల వ్యక్తి నా భుజంపై చేయి వేశాడు. మెల్లిగా తడమడం మొదలు పెట్టాడు. తండ్రి వయసు ఉన్న అతను చేస్తున్న పని నాకు అసభ్యంగా అనిపించింది. కోపంతో అతన్ని కొట్టాను, తిట్టాను. వెంటనే సిగ్గుతో బస్సు దిగి వెళ్లిపోయాడు’ అని తెలిపింది.

Anjali bhaskar about his bus incident

నాకు జరిగి ఆ అవమానం గురించి మహిళలతో సహ ఎవరూ స్పందించలేదు. ఆ సమయంలో సమాజంలో ఇంకా ఏం జరిగినా ఇదే రెస్పాన్స్ ఉంటుందా అని అవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి దారుణమైన అనుభవాలు బస్సు ప్రయాణాలు చేసే మహిళలకు తరుచూ జరుగూతూనే ఉంటాయి. కొంతమంది అమ్మాయిలు ఎదిరించి సరైన బుద్ది చెబుతారు.. కొంతమంది మాత్రం మౌనంగా ఆ బాధ భరిస్తారు. ప్రస్తుతం నేను నటిస్తున్న సీరియల్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇండస్ట్రీలో నాతో ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదు. నేను ఎవరితో అతిగా మాట్లాడను.. సర్ధుకుపోయే గుణం నాకు ఉంది. కష్టపడి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం అని తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి